ప్రపంచంలోనే ఖరీదైన ఎయిర్ వేస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా దీపికా పదుకొనే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కు మరో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎయిర్ వేస్ కు దీపికా బ్రాండ్ గా మారింది. 
 

Deepika Padukone named Global Brand Ambassador of Qatar Airways

ఏజ్ పెరుగుతున్నా కూడా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ తో  కొనసాగుతోంది  దీపికా పదుకునే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వస్తువలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూనే ఉంది దీపికా పదుకునే. ఇక ఇప్పుడు మరో సారి ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుంది.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ ఎయిర్ లైన్స్ లో ఖతార్ ఎయిర్‌ వేస్ కూడా ఒకటి. దాదాపు 150 దేశాలకు  ఫ్లైట్స్ ను నడిపిస్తోన్న ఈ ఎయిర్ వేస్ కు.. బ్రాండ్ అంబాసిడర్ గా దీపికా పదుకొనే నియమించబడింది. 

 ఖతార్ ఎయిర్‌వేస్ ఇటీవలే ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ ఇచ్చే వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్స్ లో ఎయిర్ లైన్ అఫ్ ది ఇయర్ అవార్డు 2022 సంవత్సరానికి గాను గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకోవడం ఖతార్ ఎయిర్‌వేస్ కు ఇది ఏడోసారి. ఇదే కాకుండా అనేక అవార్డులని కూడా గెలుచుకుంది ఖతార్ ఎయిర్‌వేస్.తాజాగా ఖతార్ ఎయిర్‌వేస్ తన బ్రాండ్ కి గ్లోబల్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ని నియమించారు. ఈ సందర్భంగా దీపికా పదుకొనే తో తెరకెక్కించిన ఓ యాడ్ ని ఖతార్ ఎయిర్‌వేస్ రిలీజ్ చేశారు. 

 

ఈ యాడ్లో ఎయిర్ హోస్ట్ గా కనిపించింది దీపికా.. ఈ వీడియోలో  తమ ఎయిర్ పోర్ట్స్, ఫ్లైట్స్ ఎంత లగ్జరీగా ఉంటాయో చెపుతూనే.. వారు అందించే  సౌకర్యాలను కూడా వివరించారు. ఈ యాడ్ లో డిఫరెంట్ గా దర్శనం ఇచ్చింది దీపికా పదుకొనే.  ఇక ఈ యాడ్ ని తమ సోషల్ మీడియా ఖాతాలో  పోస్ట్ చేసింది ఎయిర్ వేస్. మా కొత్త గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ దీపికా పదుకొనేను మీకు పరిచయం చేస్తున్నాం అని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. 

ఇక వరల్డ్ టాప్ ఎయిర్‌వేస్ లో ఒకటైన ఖతార్ ఎయిర్‌వేస్ కి దీపికా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో.. ఇటు బాలీవుడ్ నుంచే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా దీపికా అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకప్రస్తుతం సౌత్ సినమా బిజీలో ఉంది దీపికా. ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ k లో నటిస్తుంది. రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తరువాత కూడా హాట్ హాట్ సినిమాల్లో నటిస్తూ.. హీటు పుట్టిస్తుంది బ్యూటీ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios