దీపికా పదుకొనె 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నారు. అందుకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ పలు కండీషన్లకి సందీప్‌ ఒప్పుకోలేదని సమాచారం. అయితే దీనికి సంబంధించిమరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.   

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారనే దానిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. తాజాగా కొన్ని నివేదికల ప్రకారం, దీపికా పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో వాటా కూడా అడిగారట. తెలుగులో డైలాగులు చెప్పనని కూడా చెప్పారట.

దీపికా ఎందుకు తప్పుకున్నారు?

దీపికా దాదాపు 35 రోజుల షూటింగ్ కోసం రూ.25 కోట్ల భారీ పారితోషికంతోపాటు 10% లాభాల్లో వాటా అడిగారని, తెలుగులో డైలాగులు చెప్పనని కూడా కండీషన్‌ పెట్టారట. అదే సమయంలో 'స్పిరిట్' కథ లీక్ కావడం కూడా చిత్ర బృందాన్ని కలవరపెట్టింది.

సినిమాల్లో ఎవరి డైలాగులు వాళ్లే చెప్పాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భావిస్తారు. రోజుకి 8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తాననడం అసలు సమస్య కాదు. సినిమా షూటింగ్‌లో పని గంటలు మారుతూ ఉంటాయి. లొకేషన్‌ని బట్టి, లైటింగ్ ని బట్టి మారుతుంటుంది. 

దీనికితోడు ఇతర సాంకేతిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నటులు తమ డైలాగులు వారే చెప్పుకోవాలని, దానివల్ల సహజత్వం వస్తుందని, ఆ ఎమోషన్స్ ఆడియెన్స్ కి క్యారీ అవుతాయని భావించారని చిత్ర బృందం నుంచి వినిపిస్తున్న మాట. 

దీపికా పదుకొనెపై అసంతృప్తి

ఇటీవలే తల్లి అయిన దీపికా, తన కూతురుతో సమయం గడపడానికి రోజుకు ఎనిమిది గంటలకు మించి పని చేయనని షరతు పెట్టారు. మరోవైపు బోల్డ్ సీన్లు చేయనని ఆమె చెప్పారట. ఆమె డిమాండ్లు నెరవేరకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నారని అంటున్నారు. కానీ దీనికితోడు పైన చెప్పిన కొత్త కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఏది నిజమో వారికే తెలియాలి. ఇక ఆమె స్థానంలో `యానిమల్‌` హీరోయిన్‌ తృప్తి డిమ్రీని ఎంపిక చేశారు. దీపికా  నిర్ణయం కారణంగా తృప్తి జాక్‌ పాట్ కొట్టిందని చెప్పొచ్చు.