బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ భారతీయ పౌరురాలు కాదని, ఆమెకి ఓటు వేసే ఛాన్స్ లేదంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టింది ఈ నటి. తను కొపెన్ హెగాన్ లో పుట్టినట్లుగా తనకు ఇండియన్ పాస్ పోర్ట్ లేనట్టుగా విదేశీ పౌరసత్వం వలన తను ఓటు హక్కు వినియోగించుకోలేకపోతుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది.

తను కూడా ఓటు వేసినట్లుగా దీపిక తన వేలికి రాసిన ఇంక్ మార్క్ ను చూపించింది. తను ఓటు హక్కును వినియోగించుకున్న విషయానికి మరే ధ్రువీకరణ కావాలంటూ దీపిక ప్రశ్నించింది. నాలుగో దశ పోలింగ్ లో భాగంగా చాలా మంది సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

ఈ క్రమంలో చాలా మంది సిరా చుక్క చూపిస్తూ ఫోటోలు దిగి అభిమానులతో పంచుకున్నారు. కొందరు సెలబ్రిటీలు మాత్రం విదేశీ పౌరసత్వం కారణంగా ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు.

ఈ లిస్ట్ లో దీపిక పేరు కూడా వినిపించింది. అయితే ఆ విషయంలో నిజం లేదని స్పష్టం చేసింది దీపిక.