Asianet News TeluguAsianet News Telugu

ప్రెగ్నెన్సీని ప్రకటించిన దీపికా పదుకొనె.. చిన్నారి వచ్చేది అప్పుడే?

దీపికా పదుకొనె, రణ్‌ వీర్‌ సింగ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలో తాము పేరెంట్స్ కాబోతున్నట్టు వెల్లడించారు. చిన్నారి వచ్చేది ఎప్పుడో కూడా తెలిపారు. 
 

deepika padukone announced pregnancy first child  when the baby comes arj
Author
First Published Feb 29, 2024, 10:33 AM IST | Last Updated Feb 29, 2024, 10:38 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, `కల్కి2898ఏడీ` బ్యూటీ దీపికా పదుకొనె తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. గత కొన్ని రోజులుగా దీపికా గర్భవతి అయ్యిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆమె క్లారిటీ ఇచ్చింది. అధికారికంగా అనౌన్స్ చేశారు. తమ ఫస్ట్ చైల్డ్ కి సంబంధించి రణ్‌ వీర్‌ సింగ్‌, దీపికా తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

చిన్నారి దుస్తులతో డిజైన్‌ చేసిన ఓ పోస్ట్ ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఇందులో మరో విషయాన్ని వెల్లడించారు. తమ ఫస్ట్ చైల్డ్ వచ్చే టైమ్‌ని కూడా వాళ్లు వెల్లడించడం విశేషం. సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. దీపికాకి, రణ్‌వీర్‌ సింగ్.. సినిమాల సమయంలోనే ప్రేమించుకున్నారు. 2018లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరేళ్లకి పిల్లల్ని కనబోతుండటం విశేషం. 

దీపికా పదుకొనె ఇటీవల `పఠాన్‌`, `జవాన్‌` చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ప్రభాస్‌ సరసన `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తుంది. నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న చిత్రమిది. మే 9న విడుదల కానుంది. ఈ మూవీ ఆమె కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లబోతుంది. ఈ క్రమంలో ఆమె గుడ్ న్యూస్‌ని ప్రకటించడం విశేషం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios