విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ మూవీ రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజన్ కి గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసింది. 

జులై 26న సినిమాను గ్రాండ్ గా సౌత్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళ్ - మలయాళం - కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముగిసింది. 

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఫైనల్ గా మే9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్బంగా  సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కింది. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.