విజయ్‌ దేవరకొండ, రష్మిక  కాంబినేషన్ లో రూపొందిన చిత్రం  ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకుడు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌, యష్‌  రంగినేని నిర్మాతలు. ఇటీవలే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. అయితే మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా..చాలా సాగతీసారని, లెంగ్త్ ఎక్కువైందని అన్నారు. అదే విషయాన్ని దేవరకొండ సైతం కన్ఫర్మ్ చేసారు. కొంచెం ఓపికగా చూస్తే నచ్చుతుందని సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ డబ్బులు పెట్టి కొని రిలీజ్ చేసిన బయ్యర్లుకు చిరాకు పుట్టిస్తున్నాయి. హీరోనే ..ఇలా అంటే ఖచ్చితంగా ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడుతుందని అంటున్నారు.

అలాగే కొందరు బయ్యర్లు వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ బాగున్నా, నెక్ట్స్ డే నుంచి సోమవారం నుంచి డ్రాప్ స్టార్టవుతుందని , అలా కాకుండా ఉండాలంటే ట్రిమ్ చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ తీసేయాలని నిర్మాతలకు ఫోన్ చేస్తున్నారట. అయితే నిర్మతలు మాత్రం సినిమాలో ఏదీ ట్రిమ్ చేయలేమని, ఒకటి కట్ చేస్తే దానికి  సంబందించిన సీన్ సెకండాఫ్ లో పే ఆఫ్ కాదని అంటున్నారుట.  అప్పటికీ మీరు ట్రిమ్ చేయాలంటే ఏ పార్ట్ లో దాన్ని తీసేయాలని భావిస్తున్నారో మీరే చెప్పండి అని అంటున్నారుట. మరో ప్రక్క విజయ్ దేవరకొండ స్వయంగా కూర్చుని ఫైనల్ కట్ రెడీ చేయించాడని , అందులో నిర్మాత, దర్శకుడు ప్రమేయం లేదని వినిపిస్తోంది.
 
ఇక కలెక్షన్స్ పరంగా కూడా డియర్ కామ్రేడ్ డీసెంట్ కలెక్షన్స్ నే రాబడుతుంది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ .11 కోట్ల షేర్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. కాగా నైజాంలో డియర్ కామ్రేడ్ చిత్రం మొదటి రోజు 2.73 కోట్ల పైగా షేర్ సాధించింది. అలాగే శనివారం నాడు కూడా నైజాంలో 1.54 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి.. మొత్తం రెండు రోజులకు గానూ నైజాంలో రూ .4.28 కోట్ల షేర్ ను రాబట్టింది. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శృతి రామచంద్రన్, చారుహాసన్ ముఖ్యపాత్రాలలో నటించారు.