విజయ్ దేవరకొండకి యూత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. 'గీత గోవిందం' సినిమాలో విజయ్ తో కలిసి నటించిన రష్మిక మందన్నా ఈ సినిమాలో కూడా విజయ్ కి జోడీ కట్టింది. 

భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది.

మార్చి 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించింది చిత్రబృందం.  ఈ పోస్టర్ లో స్పోర్ట్స్ డ్రెస్ లో ఉన్న రష్మిక.. విజయ్ ని గట్టిగా హత్తుకొని కనిపించింది.

కాకినాడ నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు. కథ ప్రకారం విజయ్ కాకినాడ యాసలో అలరించబోతున్నాడు.