టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ నటించిన సినిమారిలీజ్ కి ఉందంటే.. చాలా మంది హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఆ రేంజ్ కి విజయ్ ఎదిగాడు.

అలాంటిది విజయ్ దేవరకొండ ఓ సినిమాకి భయపడి తన సినిమాను వాయిదా వేసుకుంటున్నాడు.  అసలు విషయంలోకి వస్తే.. విజయ్ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమాను జూలై 19న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

అయితే ఆవారంలోనే 'ది లయన్ కింగ్' సినిమా రిలీజ్ కి ఉండడంతో తన సినిమాను వాయిదా వేసుకున్నాడు విజయ్. అలా చేయకపోతే గనుక ఓవర్సీస్ బిజినెస్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. 'ది లయన్ కింగ్' సినిమాకు భారీ క్రేజ్ ఉండడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక తన సినిమాను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యాడు విజయ్ దేవరకొండ.

ఇండియన్ సినిమాల బెడద లేకపోయినా.. డిస్నీ, మార్వల్ సినిమాలకు ఓవర్సీస్ తో పాటు ఇక్కడ కూడా క్రేజ్ ఉంటుంది కాబట్టి కచ్చితంగా తెలుగు నిర్మాతలు తమ ప్లాన్ లను మార్చుకోవాల్సి వస్తోంది. 'జెర్సీ' సినిమా వచ్చిన వారానికి 'అవెంజర్స్ ఎండ్ గేమ్' సినిమా రిలీజైంది. దాని ఎఫెక్ట్ 'జెర్సీ' సినిమా కలెక్షన్స్ పై పడింది. దీంతో విజయ్ దేవరకొండ తన సినిమా విషయంలో జాగ్రత్త పడ్డాడు.