విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'గీత గోవిందం' లాంటి హిట్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. 

భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాలేజ్, పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఈరోజు సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..'' అంటూ సాగే ఈ మెలోడీని గౌతం భరద్వాజ్ పాడారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం  అందిస్తున్నారు. మే 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.