విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో విజయ్ దేవరకొండకు యువతలో విపరీతమైన క్రేజ్ నెలకొంది. దీనితో డియర్ కామ్రేడ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. జులై 26న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

తాజాగా చిత్ర యూనిట్ ఆసక్తికరమైన పోస్టర్ ని విడుదల చేసింది. సినిమా విడుదలకు ఇక 50 రోజులు మాత్రమే ఉంది అని తెలియజేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పరిగెడుతున్న స్టిల్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. మీరు ప్రేమించే దానికోసం పోరాడండి అనే సందేశం కూడా పోస్టర్ పై ఉంది. 

డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక, విజయ్ మధ్య రొమాన్స్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా నెలకొంది ఉంది. ఇప్పటికే టీజర్ లో ఘాటు ముద్దుతో సంచలనం సృష్టించారు. మీ ఎదురుచూపులు తగ్గ ఫలితం ఉంటుంది అంటూ రష్మిక మందన కూడా ట్వీట్ చేసింది.