విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అనుకున్న డియర్ కామ్రేడ్ గట్టి దెబ్బె వేసింది. చాలా నమ్మకంతో పెట్టుబడి  గత నెల 26న సౌత్ లో నాలుగు భాషల్లో విడుదల చేశారు. ఆల్రెడీ తమిళ్ లో విజయ్ కి నోటా తో దెబ్బపడినప్పటికీ ఆలోచించకుండా రిలీజ్ చేశారు. 

కానీ  ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. డిఫరెంట్ గా ట్రై చేస్తాడని అనుకున్న విజయ్ ఈ సారి ఫ్యాన్స్ ని కూడా పెద్దగా ఎట్రాక్ట్ చేయలేకపోయాడు. దీంతో కల్లెక్షన్స్ రోజురోజుకి డ్రాప్ అయ్యాయి. ఫైనల్ గా సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ కూడా బయటకు వచ్చింది. 33కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారీగా విడుదలైన డియర్ కామ్రేడ్ వరల్డ్ వైడ్ గా 21.47కోట్లను మాత్రమే రాబట్టగలిగినట్లు తెలుస్తోంది. 

రిలీజ్ కు ముందు సినిమా ప్రమోషన్స్ ని బట్టి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్ఎదో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా విడుదలైన రెండు రోజులకే సినిమా కలెక్షన్స్ తగ్గడంతో అసలు రిజల్ట్ బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు.తమిళ్ లో అలాగే మలయాళంలో డియర్ కామ్రేడ్ నిర్మాతలకు బారి నష్టాలను కలుగజేసినట్లు తెలుస్తోంది. 

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ - బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు.