Asianet News TeluguAsianet News Telugu

డియర్ కామ్రేడ్ 3 డేస్ కలెక్షన్స్.. లాభాలతో గట్టెక్కుతుందా!

విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ తెరక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా విజయ్, రష్మిక ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ ముగిసేసమయానికి డీసెంట్ వసూళ్ళని సాధించింది. 

Dear Comrade 3 days Box office collections
Author
Hyderabad, First Published Jul 29, 2019, 2:56 PM IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా స్లోగా ఉన్నపటికీ విజయ్, రష్మిక ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు తెలిపారు. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరక్కించాడు. మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించింది. 

డియర్ కామ్రేడ్ చిత్రం తొలి వీకెండ్ లో పరవాలేదనిపించే విధంగా వసూళ్లు రాబట్టింది. శుక్రవారం రోజు డియర్ కామ్రేడ్ చిత్రం రెండు తెలుగురాష్ట్రాల్లో 6 కోట్ల పైగా ఓపెనింగ్స్ సాధించింది. శని, ఆదివారాల్లో డియర్ కామ్రేడ్ జోరు కాస్త నెమ్మదించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో డియర్ కామ్రేడ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల పైగా షేర్ రాబట్టింది. 

నైజాం, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి లాంటి ప్రాంతాల్లో డియర్ కామ్రేడ్ చిత్రం ఇప్పటికే 60 శాతానికి పైగా రికవరీ సాధించింది. సీడెడ్ లో ఈ చిత్ర బాక్సాఫీస్ రన్ ఆశించిన స్థాయిలో లేదు. డియర్ కామ్రేడ్ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 34 కోట్ల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 16 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. 

వీకెండ్ ముగిసిన నేపథ్యంలో ఇకపై ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. నైజాం లో 5.6 కోట్ల షేర్, 1.08 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.5 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.2 కోట్లు, కృష్ణలో 73 లక్షల షేర్ రాబట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios