Asianet News TeluguAsianet News Telugu

తెలుగులో వస్తోన్న మరో హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. రోహిత్‌ శర్మపై `డెడ్‌ పూల్‌` హీరో కామెంట్‌..

ఇండియన్‌ బాక్సాఫీసుపైకి దండయాత్ర చేసేందుకు మరో సినిమా వస్తుంది. పాపులర్‌ డెడ్‌ పూల్ నుంచి `డెడ్‌పూల్‌ వాల్వెరినే చిత్రం విడుదల కాబోతుంది. 
 

Deadpool actor sensational comment on Rohit sharma arj
Author
First Published Jul 7, 2024, 12:16 AM IST | Last Updated Jul 7, 2024, 12:27 AM IST

ఒకప్పుడు హాలీవుడ్‌ చిత్రాలు ఇండియాలో బాగా ఆడేవి. కలెక్షన్లని కొల్లగొట్టాయి. `అవతార్‌`, `అవేంజర్స్`,  `స్పైడర్‌ మ్యాన్‌` నుంచి `జురాసిక్‌ పార్క్`, `ది జింగిల్‌ బుక్‌`, `ది లయన్‌ కింగ్` వంటి చిత్రాలు ఇండియాలో విడుదలై బాక్సాఫీసు సునామీ సృష్టించాయి. `అవతార్‌ 2` సినిమా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది. అత్యధికంగా 378కోట్లతో `అవతార్‌ 2` టాప్‌లో ఉంది. ఆ తర్వాత `అవెంజర్స్`, `ది జంగిల్‌ బుక్‌` లాంటి చిత్రాలున్నాయి. 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా ఇండియా బాక్సాఫీసుపై రచ్చ చేసేందుకు వస్తుంది. `డెడ్‌ పూల్‌ అండ్‌ వుల్వరైన్‌` పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. సూపర్‌ హీరో కాన్సెప్ట్ తో, భారీ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కించారు. ఫాన్‌ లేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర్యాన్‌ రేనాల్డ్స, హ్యూ జాకమ్‌, ఎమ్మా కార్రిన్‌, మాథ్యూ మెకఫేడెన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఇచ్చింది టీమ్‌. ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేయబోతున్నారు. 

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరో హ్యూజాక్‌ మన్‌ టీమిండియా క్రికెటర్‌ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మీరు భయంకరమైన క్రికెట్ అభిమాని కదా?’ అని అడిగినప్పుడు వుల్వరైన్ ‘అవును’ అని చెప్తారు. అపుడు ఆ ఇంటర్వ్యూయర్ ఇలా అడుగుతాడు ‘మీకు ప్రస్తుతం క్రికెట్ లో ఎవరంటే బాగా ఇష్టం? అనో అడగగా. దానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘రోహిత్’ అని సమాధానం చెప్తారు హ్యూ జాక్‌మన్. రోహిత్ శర్మ రీసెంట్ గా ఇండియా కి వరల్డ్ కప్ సాధించాడు అని అడిగినప్పుడు. ‘నాకెందుకు తెలీదు. రోహిత్ ఒక బీస్ట్ లాగా ఆడతాడు. నాకు అతని ఆట చూడడం చాలా ఇష్టమని’ తన అభిమానాన్ని పంచుకున్నారు హ్యూ జాక్‌మన్. 

హ్యూ జాక్‌మన్ రోహిత్ పై తన అభిప్రాయాన్ని చెప్పడం వలన భారత దేశంలోని కోట్లమంది గుండెల్లో హ్యూ జాక్‌మన్ ఆనందం నింపేలా చేశారు. మార్వెల్ స్టూడియోస్ డెడ్‌పూల్ & వుల్వరైన్ జూలై 26న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. మరి గత చిత్రాల మాదిరిగా ఇది కలెక్షన్ల సునీమా సృష్టిస్తుందా ? అనేది తెలియాల్సి ఉంది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios