హాసీనా కోసం డిడిఎల్‌జే సినిమాను  ఆపేశారు.22 సంవత్సరాలలో మొదటి  సారి నిలిపారు.తిరిగి ప్రారంభించిన డిడిఎల్‌జే. 

మీరు ఎక్క‌డొ ఒక సారి వినే ఉంటారు, మ‌న దేశంలో ఒకే సినిమాను 22 సంవ‌త్స‌రాలుగా ఇప్ప‌టికి న‌డిపిస్తున్నారని. అదే బాలీవుడ్ బ్లాక్ బాస్ట‌ర్ దిల్‌వాలే దుల్హనియా లె జాయేంగే. షారుక్‌ ఖాన్, కాజ‌ల్ న‌టింటిన ఈ సినిమా అక్టోబ‌ర్‌ 19 1995 సంవ‌త్స‌రంలో విడుద‌ల అయింది. ముంబాయి నగ‌రంలో మరాఠ‌ మందిర్ థియోట‌ర్‌లో అక్టోబ‌ర్ 20 వ తేది నుండి ప్ర‌తి రోజు డిడిఎల్‌జే సినిమాను ఏ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌తి రోజుకి ఒకే ఒక్క షో ను వేస్తారు. ఇప్ప‌టికి యువ‌తతో పూర్తి స్థాయిలో నిండిపోతుంది. ప్ర‌తి రోజు 11.30 నిమిషాల‌కు షో వేస్తారు. 


 కానీ దావుద్ ఇబ్ర‌హీం సోద‌రి కోసం 22 సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశారు. దావుద్ ఇబ్ర‌హీం సోద‌రి హాసీనా పార్కార్ జీవిత చ‌రిత్రగా తెర‌కెక్కుతున్న చిత్రం క్వీన్ ఆఫ్ ముంబాయి. శ్ర‌ద్దా దాస్ లీడ్ రోల్ లో న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ ను గురువారం విడుద‌ల చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను మ‌రాఠ మందిర్ లో ప్ర‌ద‌ర్శించారు. 11.30 నిమిషాలకు డిడిఎల్‌జే సినిమాను ప్ర‌ద‌ర్శించాలి. కానీ క్వీన్ ఆప్ ముంబాయ్ ట్రైల‌ర్ విడుద‌ల కోసం 22 సంవ‌త్స‌రాల చ‌రిత్రను తిర‌గ‌రాశారు.

తిరిగి గురువారం నాడు 11.30 నిమిషాలు డిడిఎల్‌జే ను తిరిగి ప్ర‌ద‌ర్శిస్తామ‌ని మ‌రాఠ థియోట‌ర్ యాజ‌మాన్యం తెలిపారు. ఇక మీద‌ట భ‌విష‌త్తులో ఎలాంటి అటంకాలు లేకుండా దిల్‌వాలే దుల్హనియా లె జాయేంగే ప్ర‌ద‌ర్శిస్తామ‌ని తెలిపారు.