ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వలన ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది సక్సెస్ ఫుల్ గా ఈ మహమ్మారిని జయిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా సోకిన వారిలో కొంతమందికి సైడ్‌ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కొంతమంది కాళ్లలో రక్తం గట్టకట్టుతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి జుడీ ఎవాన్స్ కాళ్లను రెండు సార్లు కట్ చేసారు డాక్టర్స్.  

వివరాల్లోకి వెళితే.. ‘డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్’‌ షో ద్వారా మంచి గుర్తింపు సాధించిన ఎవన్స్..కొద్ది రోజుల క్రితం గుర్రం నుంచి కింద జారీ పడ్డారు. దీంతో ఆమెను హాస్పటల్ లో చేర్పించారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా సోకింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు ఆమెకు కనిపించటంతో టెస్ట్ లు చేసి కరోనా నిర్ధారించారు. కరోనాకు ట్రీట్మంట్ తీసుకుంటున్న సమయంలో సైడ్ ఎఫెక్ట్ తో జుడి రెండు కాళ్లలో రక్తం కూడా గడ్డ కట్టింది. గడ్డ కట్టిన రక్తం తొలిగించేందుకు ఆమె రెండు కాళ్లను రెండు సందర్భాల్లో ఆపరేషన్  చేశారు వైద్యులు. దాంతో ఆమె కాళ్లు పనిచేయని స్దితికి వచ్చాయి.

ఈ విషయాన్ని వెల్లడించిన జుడి మేనేజర్.. ”23 రోజులుగా ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎవన్స్ కోలుకుంటున్నారు. కరోనా పరీక్షల్లో ఇంకా నెగిటివ్ రాలేదు. తనకు బావుండాలని కోరుకున్న అందరికీ ఆమె థ్యాంక్స్ చెప్పమన్నారు” అని పేర్కొన్నారు.

గతంలో హాలీవుడ్ న‌టుడు నిక్ కార్డెరోకి కూడా కరోనా సోకగా.. దాని వలన ఆయన కుడికాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి స‌ప‌రేట్ పార్ట్‌గా అయ్యింది. దీని వలన ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని భావించిన వైద్యులు తప్పని పరిస్థితుల్లో అతని కాలును తొలగించిన విషయం తెలిసిందే.