“లవ్ స్టోరీ”..ఈ రెండు రోజులు కీలకం

తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ ,ట్రైలర్ తో చెప్పాస్తారు శేఖర్ కమ్ముల. ట్రైలర్ లో  కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్ కోసం జనం ఎదురుచూస్తున్నారు.
 

Dates locked for trailer and pre-release event of Love Story jsp

ఇప్పుడు ఎక్కడ విన్నా సారంగ దరియా పాటే. జనాల్లోకి ఎంతగా ఆ  పాట వెళ్లిపోయిందంటే రేపు థియోటర్స్ కు జనం కేవలం ఆ పాట కోసమే క్యూ కట్టేటంత. ఆ సినిమా మరేదో కాదు లవ్ స్టోరీ.  అక్కినేని నాగ్‌చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో ఈ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ట్రైలర్ రిలీజ్ డేట్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్లపై ఉత్కంఠ నెలకొంది.
 
అందుతున్న సమాచారం మేరకు ... ఏప్రిల్ 8వ తేదీన లవ్‌స్టోరీ మూవీ ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. అలాగే ఏప్రిల్ 13 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్  నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉండటంతో అతి తక్కువ మందితో ఈ రెండు ఈవెంట్లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న లవ్‌స్టోరీలో నాగ్ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నుట్టు తెలిసింది. అటు సాయి పల్లవి సినిమాలో డ్యాన్సర్‌గా కన్పించనుందట. ఏప్రిల్ 16వ తేదీన విడుదల కాబోతున్న ఈ ప్రేమకథ నాగచైతన్య ఇమేజ్ ని కొత్తగా ప్రొజెక్ట్ చేస్తుందని టీం అంటోంది.

ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. . ప్రేమలో కనిపించే బావోద్వేగాలను ప్రధానంగా ఈ సినిమాని డిజైన్ చేసారు శేఖర్ కమ్ముల. తను ఎలాంటి కథను చెప్పబోతున్నాడో ఆ ఫీల్ ని పోస్టర్ ,ట్రైలర్ తో చెప్పాస్తారు శేఖర్ కమ్ముల. ట్రైలర్ లో  కథను పరిచయం చేయడం లో శేఖర్ కమ్ముల మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్ కోసం జనం ఎదురుచూస్తున్నారు.
ఆర్ట్:రాజీవ్ నాయర్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్,
సహా నిర్మాత : విజయ్ భాస్కర్,
 పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా,
డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల
మ్యూజిక్ : పవన్
నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు
రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios