నిహారిక-జొన్నలగడ్డ చైత్యన్య నిశితార్ధ వేడుక జరిగి రెండు నెలలకు పైగా అవుతుంది. ఆగస్టు నెలలో బంధువులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నిశితార్థం అనంతరం నిహారిక పెళ్లి వేడుక డిసెంబర్ లో ఉంటుందని తండ్రి నాగబాబు చెప్పారు. చెప్పిన విధంగానే డిసెంబర్ లో పెళ్లి తేదీ మరియు వేదిక నిర్ణయించడం జరిగింది. 

డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7:15 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్ణయించగా రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ప్రఖ్యాత ఉదయ్ విలాస్ లో ఈ వివాహం జరగనుంది. ఈ విషయాన్ని పెళ్లి కొడుకు చైతన్య తండ్రి ఐ జి ప్రభాకర్ రావు తెలియజేశారు. 

ఈ ఏడాది ప్రారంభంలోనే నిహారికకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన నాగబాబు, జొన్నలగ్గడ్డ చైతన్యను వరుడిగా నిర్ణయించారు. గుంటూరుకు చెందిన పోలీస్ అధికారికి ఐ జి ప్రభాకర్ రావు చిరంజీవి కుటుంబానికి చాలా కాలంగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. దీనితో ఈ సంబంధం నిశ్చయం అయ్యింది.