క్రేజీ హీరోయిన్ అనుష్కకు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. అనుష్క లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా అద్భుతమైన కలెక్షన్లు వస్తుంటాయి. కాగా అనుష్క బాహుబలి చిత్రం తర్వాత కాస్త జోరు తగ్గించింది. బాహుబలి తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. 

ఇదిలా ఉండగా అనుష్క ప్రస్తుతం నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. కోన వెంకట్ నిర్మణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ నటుడు మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి తన లుక్ మార్చుకుంది. ఎట్టకేలకు నిశ్శబ్దం చిత్ర యూనిట్ ఆసక్తికర వార్తని ప్రకటించింది. సెప్టెంబర్ 11న ఈ చిత్రంలోని అనుష్క ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. 11వ తేదీ ఉదయం 11:11 గంటలకు నిశ్శబ్దం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. 

గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా నటుడు సుబ్బరాజు, షాలిని పాండే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు హేమంత్ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.