Asianet News TeluguAsianet News Telugu

‘వాల్తేరు వీరయ్య’ నుంచి మరో సాంగ్.. రిలీజ్ కు డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి మరో క్రేజీ సాంగ్ రాబోతోంది. తాజాగా మేకర్స్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ అందించారు. 
 

Date and time fix for another song release from Waltair Veerayya!
Author
First Published Jan 10, 2023, 6:40 PM IST

సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి  -  శృతి హాసన్ జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్  ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండుడ్రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. ముఖ్యంగా మూవీలోని సాంగ్స్ దుమ్ములేపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో పాటను రిలీజ్ సిద్ధం చేశారు. దీనిపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.

ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’నుంచి మాస్, క్లాస్, మెలోడీగా ‘బాస్ పార్టీ’,‘నువ్వు శ్రీదేవీవైతే నేను చిరంజీవిని’,‘వీరయ్య టైటిల్ సాంగ్’,‘పునకాలు లోండింగ్’ అనే సాంగ్స్ రిలీజ్  అయ్యి యూట్యూబ్ లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ‘నీకేమో అందమెక్కువ’ (Neekemo Andamekkuva) అంటూ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. రేపు (జనవరి 11న) ఉదయం 10 గంటల 35 నిమిషాలకు విడుదల కాబోతోంది. 

బాలయ్య ‘వీరసింహారెడ్డి’కి పోటీగా బాస్ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి బరిలో ఉంది. ఈ రెండు చిత్రాలతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ దక్కినట్టే. ప్రస్తుతం హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను జరుపుతుంది. ఏపీలో ఈ రెండు చిత్రాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్  (Shruti Haasan)చిరు సరసన తొలిసారిగా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో అలరించబోతున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios