'దాస్ కా ధమ్కీ' రియల్ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి, హిట్టేనా లేక..?
రీసెంట్ గా దాస్ కా ధమ్కీ అంటూ మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు విశ్వక్సేన్. విడుదలైన రోజు ఓ ఊపు ఊపిన కలెక్షన్స్ లో ఆ తర్వాత పూర్తి డ్రాప్ కనపడింది. ఆ డిటేల్స్

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనేంటో ప్రూవ్ చేసుకుంటున్న విశ్వక్ సేన్ కొంత గ్యాప్ తరవాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా తానే హీరో నటించాడు. పైగా ఇది హోం ప్రొడక్షన్. స్క్రీన్ ప్లే, డైలాగ్, దర్శకత్వం అన్నీ తానై నడపటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. 'దాస్ కా ధమ్కీ' ఉగాది కానుకగా ఈ నెల 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. వరుస ప్రమోషన్స్ తో ఎక్కడ చూసినా తనే కనిపించాడు. దాంతో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ నిలబడలేదు.
మొదటి రోజు ఉగాది రోజు తో తో పోల్చుకుంటే రెండో రోజునే వసూళ్లు తగ్గాయి .. మూడో రోజునుంచి అంతంత మాత్రంగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. యావరేజ్ సినిమాగా భాక్సాఫీస్ దగ్గర మిగలనుంది. కథపై ఇంకాస్త కసరత్తు .. స్క్రీన్ ప్లే పై మరింత దృష్టి పెట్టి ఉంటే, రెండు పాత్రల బాడీ లాంగ్వేజ్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసి ఉంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదనే చెప్తున్నారు.
ఈ సినిమాలో విష్వక్ ద్విపాత్రాభినయం చేశాడు. కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకొని, ప్రెండ్స్ తో కలిసి పెరుగుతాడు. ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. ఒక్కసారైనా వెయిటర్ లా కాకుండా కస్టమర్ లా తను పని చేసే హోటల్ లోనే ఎంజాయ్ చేయాలని.. తన స్నేహితులతో కలిసి వేసిన ప్లాన్ వల్ల కృష్ణ దాస్ జీవితం తలకిందులవుతుంది. .ఆ ప్లాన్ ఏమిటి..ఆ ప్లాన్ లోకి SR ఫార్మా చైర్మన్‌గా డాక్టర్ సంజయ్ రుద్ర ( రెండో విశ్వక్ సేన్) ఎలా వచ్చారు. అనేది మిగతా ట్విస్ట్ లతో కూడిన కథ.
ఫస్టాఫ్ లో కథ రొటీన్ గా నడవటం, సెకండాఫ్ లో ట్విస్టులు ఎక్కువైపోయి..సినిమా ఎటెటో వెళ్లిపోయిన పీలింగ్ వస్తుంది. హీరో ద్విపాత్రాభినయమే ఈ సినిమాలో ప్రధానమైన అంశం అయినా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. విశ్వక్ సేన్ నటుడిగా తాను చెయ్యగలిగినంతా చేశాడు. దర్శకత్వం పరంగా చూసుకుంటే మాత్రం జస్ట్ ఓకే.! నిర్మానం పరంగా ఫుల్ మార్క్స్ వేయించుకున్నాడు.