దర్శకరత్న దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో చాలా కాలంగా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయన మరణించిన తరువాత అవి మరింత ఎక్కువయ్యాయి.

ఇటీవల దాసరి పెద్ద కుమారుడు తారక ప్రభు కనిపించడం లేదంటూ అతడి మేనమామ నార్ల సురేంద్రప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తారీఖు 
నుండి మిస్ అయిన ప్రభు సీసీ ఫుటేజ్ ల ఆధారంగా చిత్తూరు బస్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.

ఎట్టకేలకు దాసరి ప్రభు జాడను పోలీసులు కనుగొన్నారు. అతడి ఆచూకి లభించడంతో హైదరాబాద్ కి తిరిగి తీసుకొచ్చారు. నిన్న దాసరి ప్రభు హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకున్నారు. 

దాసరి కొడుకు కోసం చిత్తూరు పోలీసుల అన్వేషణ!