స్టార్ హీరో కుర్చీకి పరిమితం..మూవీ ఫ్లాప్ అన్నారు కానీ, బొమ్మరిల్లు తర్వాత దాసరికి నచ్చిన చిత్రం ఇదే
టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు కొన్ని ఉంటాయి. ప్రేక్షకులని మెప్పించడమే కాదు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. మంచి సినిమా వస్తే దాసరి నారాయణరావు లాంటి లెజెండ్రీ దర్శకులు అభినందిస్తూ ఉంటారు.
టాలీవుడ్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు కొన్ని ఉంటాయి. ప్రేక్షకులని మెప్పించడమే కాదు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. మంచి సినిమా వస్తే దాసరి నారాయణరావు లాంటి లెజెండ్రీ దర్శకులు అభినందిస్తూ ఉంటారు. చిన్న దర్శకులని నిర్మాతలని దాసరి గారు బాగా ప్రోత్సాహించేవారు.
బొమ్మరిల్లు తర్వాత దాసరికి నచ్చిన చిత్రం
కొత్త తరం వచ్చాక తనకి బాగా నచ్చిన చిత్రాలు చాలా తక్కువ అని దాసరి తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో తనకి బాగా నచ్చిన చిత్రం బొమ్మరిల్లు అని దాసరి తెలిపారు. బొమ్మరిల్లు తర్వాత నాకు ఏ సినిమా నచ్చలేదు. కానీ నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి చిత్రం అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కురిపించారు. బొమ్మరిల్లు తర్వాత నాకు నచ్చిన సినిమా అదే. తెలుగు ఇండస్ట్రీ కూడా కొత్త తరహా సినిమాలు చేయగలదు అని నిరూపించడానికి ఊపిరి పోసిన చిత్రం ఊపిరి మూవీ అని దాసరి అభినందించారు.
కుర్చీలో నాగార్జున.. ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్స్
బొమ్మరిల్లు తర్వాత నన్ను పూర్తి స్థాయిలో మెప్పించిన చిత్రం లేదు. కానీ ఊపిరి చిత్రంలో ప్రతి అంశం నాకు నచ్చింది. మంచి మేకింగ్, అద్భుతమైన పెర్ఫామెన్స్ లు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడూ తెలుగులో ఇలాంటి సినిమా చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పోస్టర్స్ లో చూసి నాగార్జున ఏంటి కుర్చీలో కూర్చుని ఉన్నాడు.. ఈ సినిమా ఆడదు అని కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. డ్యాన్సులు, ఫైట్స్ చేసే హీరోని రెండున్నర గంటల పాటు కుర్చీలో సినిమా చేయడం అనేది సాహసం. ఈ చిత్రంలో నటించిన కార్తీ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ కుర్రాడు ఇలాంటి పెర్ఫామెన్స్ కూడా చేయగలడా అని ఆశ్చర్యపోయినట్లు దాసరి తెలిపారు.
క్రెడిట్ వంశి పైడిపల్లిదే..
ఈ చిత్రం విషయంలో ప్రధానంగా క్రెడిట్ ఇవ్వాల్సింది దర్శకుడు వంశీ పైడిపల్లికి. ప్రతి సన్నివేశంలో దర్శకుడి ప్రతిభ కనిపించింది. తమన్నా చేత ఇలాంటి పాత్రలు కూడా చేయించవచ్చు అని ఎవరూ ఊహించి ఉండరు అంటూ దాసరి ప్రశంసలు కురిపించారు.
నాగార్జున కెరీర్ లో ఊపిరి చిత్రం ఒక డిఫెరెంట్ మూవీగా నిలిచిపోతుంది. నాగార్జున ఈ చిత్రంలో కాళ్ళు కోల్పోయిన బిలీనియర్ గా నటించారు. ఈ చిత్రం అనేక ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున పెర్ఫార్మెన్స్ ని రాజమౌళి, వివి వినాయక్, శ్రీను వైట్ల లాంటి టాప్ డైరెక్టర్ అభినందించారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక మహేష్ బాబు నాగార్జునకి ఫోన్ చేశారట. ఈ చిత్రాన్ని అభినందిస్తూ 20 నిమిషాలు మాట్లాడారట. తెలుగులో మహేష్ బాబు బయటకి చెప్పలేని మాటలు కూడా వాడారని నాగార్జున సరదాగా అన్నారు.
వైవిధ్యమైన పాత్రల్లో నాగార్జున
ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలి చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. టాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే వెంటనే వినిపించే మాట కింగ్ నాగార్జున. నాగార్జున అందగాడు మాత్రమే కాదు వేల కోట్లకి అధిపతి కూడా. నాగార్జున ఒక సందర్భంలో జయప్రద హోస్ట్ గా చేసిన ఇంటర్వ్యూకి అతిథిగా హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో నాగార్జున జయప్రదతో అనేక విషయాలు పంచుకున్నారు.
మీరు నటుడిగా, బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నారు. ఈ రెండింటిలో దేనిలో మీరు బెస్ట్ అని అడిగింది. తన ప్రాధాన్యత ఎప్పుడూ నటనకే అని నాగార్జున తెలిపారు. అసలు తనని తానూ బిజినెస్ మాన్ అని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఒక వైపు నాగార్జున హీరోగా రాణిస్తూనే వైవిధ్యమైన పాత్రలకు కూడా సిద్ధం అంటున్నారు. ఇక సీతారామం చిత్రంలో కూడా నాగార్జున హీరోగా నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆయన సీతారామం చిత్రాన్ని అంగీకరించలేదు. దీనితో ఆ ఛాన్స్ దుల్కర్ సల్మాన్ కి వెళ్ళింది.