మామగారి మృతిపై అనుమానాలున్నాయంటున్న దాసరి కోడలు సుశీల

dasari daughter in law susheela sensational comments on his death
Highlights

  • మామగారి మృతిపై అనుమానాలున్నాయంటున్న దాసరి కోడలు సుశీల
  • ఆస్తిలో వాటాలేమీ ఇవ్వలేదని సంచలన కమెంట్స్
  • మనవడిని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానన్నారంటున్న సుశీల
  • తను ఇంటికి వస్తే మామను కలవనీయలేదని ఆరోపణలు

దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయిన వేళ ఆయన మరణంపై దాసరి పెద్ద కోడలు సుశీల సంచలన ఆరోపణలు చేసారు. మామగారి మరణంపై అనుమానాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అనుమానాలతో పాటు... నిన్న అంత్యక్రియలు కూడా పూర్తికాక ముందే ఆస్తుల్లో వాటా విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించడం చర్చనీయాశం అయింది. సుశీల ప్రవర్తన అందరినీ విస్మయానికి గురి చేసింది.

 

లాస్ట్ టైం మామగారు ఆసుపత్రిలో ఉన్నపుడే చాలా మంది అనుమానం వ్యక్తం చేసారు. అంత ఆరోగ్యమైన మనిషి హఠాత్తుగా ఇలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేసారని... ఇంతలోనే ఆయన మరణ వార్త రానే వచ్చిందనీ... తనకు చాలా అనుమానాలున్నాయని సుశీల ఆరోపించారు. మా కుటుంబంలో కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయి కానీ నాకు నా భర్త విడాకులు అయితే ఇవ్వలేదు అని సుశీల అన్నారు. లాస్ట్ టైమ్ కూడా నేనొచ్చానని, అయితే నన్ను లోనికి వెళ్లనివ్వలేదని సుశీల ఆరోపిస్తున్నారు. అందుకే నాకు కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు.

 

తాను చివరగా మే 4న మామగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన దగ్గరకు వెళ్లానని, ఆయన మంచిగా మాట్లాడారని సుశీల తెలిపారు. మాస్టర్ దాసరి నారాయణ రావును సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని అడగ్గా... తప్పకుండా చేస్తానమ్మా అన్నారు. ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది, రెండు వారాల తర్వాత రండి కూర్చుని మాట్లాడుకుందామన్నారు అని సుశీల చెప్పారు.

 

మాకు ఆస్తిలో భాగం ఏమీ ఇవ్వలేదనీ.. రెండు వారాల తర్వాత కూర్చుని చేస్తానమ్మా, ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిన నేను మీకు అన్యాయం చేయను. నా మనవడిని నేను దగ్గరికి తీసుకుంటాను అన్నారు. అంతలోనే ఇలా జరిగిందని సుశీల అన్నారు. అంతే కాక దాసరిగారి మరణం పై అనుమానాలున్నాయని సుశీల ఆరోపించారు.

loader