హీరో నాని టైం ఏం బాలేదు. వరుస ప్లాప్స్ ఆయన్ని దెబ్బతీస్తున్నాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కమర్షియల్ గా ఆడటం లేదు. దానికి ఓ ప్రధాన కారణం ఉంది.

టక్ జగదీష్, వి చిత్రాలను మినహాయిస్తే ఈ మధ్య కాలంలో నాని(Nani) చేసిన చిత్రాలకు పాజిటివ్ రివ్యూస్ దక్కాయి. ఆ రెండు ఓటీటీలో విడుదలయ్యాయి కాబట్టి వాటిని వదిలేద్దాం. జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్నాయి. వీటిలో శ్యామ్ సింగరాయ్ మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటింది. ఏపీలో కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలు మిగిల్చింది. ఇక నాని లేటెస్ట్ రిలీజ్ అంటే సుందరానికీ భారీ నష్టాలు మిగిల్చింది. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అంటే సుందరానికీ(Aante Sundaraniki) 19 నుండి 20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. 

నిజానికి ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ నడిచింది. అంటే సుందరానికీ నష్టాలు మిగల్చడానికి ప్రధాన కారణం పెద్ద చిత్రాలు థియేటర్స్ లో ఉండడం వలనే. మే 12న విడుదలైన సర్కారు వారి పాట నెలకు పైగా థియేటర్స్ లో ఉంది. ఇక జూన్ 3న విడుదలైన విక్రమ్, మేజర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ మూడు హిట్ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా జూన్ 10న నాని దిగాడు. ఊహించని విజయం సాధించిన విక్రమ్ ముందు నాని అంటే సుందరానికీ నిలబడలేకపోయింది. 

శ్యామ్ సింగరాయ్ పరిస్థితి కూడా అదే. నిజానికి శ్యామ్ సింగరాయ్ భారీ లాభాలు తేవాల్సింది. కానీ అఖండ పుష్ప చిత్రాల మేనియాలో ఆ మూవీ కొట్టుకుపోయింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ బ్లాక్ బస్టర్. 17న విడుదలైన పుష్ప ఓవర్ ఆల్ గా ఇండస్ట్రీ హిట్. అఖండ, పుష్ప సినిమాల రన్ థియేటర్స్ లో చాలా కాలం కొనసాగింది. డిసెంబర్ 24న విడుదలైన శ్యామ్ సింగరాయ్ ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ కోల్పోయింది. 

గత అనుభవాల దృష్ట్యా నాని పెద్ద చిత్రాల మధ్య విడుదల చేయకుంటే మంచిది. కానీ ఆయన లేటెస్ట్ మూవీ దసరా చిరు(Chiranjeevi), బాలయ్యకు పోటీగా దింపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య 107వ చిత్రం, చిరంజీవి గాడ్ ఫాదర్ రెండూ దసరా కానుకగా విడుదల చేయనున్నారనేది టాలీవుడ్ టాక్. అలాగే నాని దసరా చిత్రం కూడా ఇదే సీజన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్. మరి ఇదే జరిగితే నానికి మరోమారు చేదు అనుభవం ఎదురయ్యే సూచనలు కలవు. అలా అని ప్రతిసారి అదే రిపీట్ అవుతుందని అనుకుంటే పొరపాటే. అనేక సందర్భాల్లో చిన్న హీరోల చిత్రాలు స్టార్స్ ని మట్టికరిపించాయి. మరి చూడాలి దసరా సమరంలో విజయం ఎవరిదో...