Asianet News TeluguAsianet News Telugu

`దసరా` క్లైమాక్స్ కీర్తిసురేష్‌ దా? క్రెడిట్‌ వెళ్తుందని చివర్లో మార్పు? నాని ఏం చేశాడు, అసలేం జరిగింది?

`దసరా` సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విసయం లీక్‌ అయ్యింది. సినిమా క్లైమాక్స్ ముందు వేరే ఉండేదట. క్లైమాక్స్ చివర్లో మార్చారని తెలుస్తుంది. 

dasara movie climax with keerthy suresh ? but changed in lastly what happen ? arj
Author
First Published Apr 2, 2023, 2:07 PM IST

నాని హీరోగా నటించిన `దసరా` చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లలో రన్‌ అవుతుంది. తెలంగాణలో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. తెలంగాన బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన చిత్రం కావడంతో ఇక్కడి ఆడియెన్స్ ఎక్కువగా చూస్తున్నారు.  ఏపీలో కలెక్షన్లు కాస్త డల్‌గా ఉన్నాయి. కానీ ఓవర్సీస్‌లో మాత్రం బాగానే కలెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా డెబ్బై కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసింది. 39కోట్ల షేర్‌ వచ్చింది. మున్ముందు ఈ సినిమా బాగానే కలెక్షన్లని సాధించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని స్టోరీ విషయంలో రక రకాల కామెంట్లు వస్తున్నాయి. నిజానికి సినిమాలో బలమైన కథ లేదు. కథ బాగా ఉన్నా, దాన్ని బలంగా చెప్పలేకపోయాడు దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెల. ఆయనకిది తొలి చిత్రం కావడం విశేషం. టెక్నీషియన్‌గా సక్సెస్‌ అయ్యాడు, కానీ సినిమాకి పరిపూర్ణంగా న్యాయం చేయలేకపోయాడు. కథలో చాలా మంచి అంశాలున్నాయి, కానీ వాటిని బలంగా చెప్పలేకపోవడమే ఈ సినిమాకి పెద్ద మైనస్‌. దీనికితోడు అతిగా వాడే మద్యం, స్కిల్క్ స్మిత బార్‌ సీన్లు ఆడియెన్స్ కి చిరాకు తెప్పించాయి. మరోవైపు సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయడంతో యూనివర్సల్‌ గా కనెక్ట్ అయ్యే అంశాలు, సిగ్నేచర్‌ మూవ్‌మెంట్స్ మిస్‌ అయ్యాయి. ఇది నార్త్ లో పెద్దగా కనెక్ట్ కాకపోవడానికి కారణమవుతుంది. 

ఇదిలా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విసయం లీక్‌ అయ్యింది. సినిమా క్లైమాక్స్ ముందు వేరే ఉండేదట. క్లైమాక్స్ చివర్లో మార్చారని తెలుస్తుంది. సినిమా క్లైమాక్స్ లో విలన్లని కొట్టిన తర్వాత ధరణి(నాని పాత్ర)ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లే ప్రయత్నంలో చివరగా అసలు విలన్‌ నంబి మిగిలిపోతాడు. తన స్నేహితుడిని చంపిన నంబిని చంపకుండా వెళ్తున్నాననే బాధ ధరణిని వెంటాడుతుంది. దీంతో పోలీసులను ఎదుర్కొని, వారి నుంచి తప్పించుకుని రావణుడి బొమ్మపై దాచిన తాను ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద కత్తిని తీసుకుని ఒక్కవేటుతో విలన్‌ తల ఎగరేస్తాడు. దీంతో కథ సుఖాంథం అవుతుంది. 

కానీ అసలు ముందనుకున్న క్లైమాక్స్ వేరే ఉందట. నానికి బదులు విలన్‌ని హీరోయిన్‌ కీర్తిసురేష్‌ చంపుతుందట. నానిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తన పరిస్థితికి కారణమైన, తన భర్తని చంపిన విలన్‌ అంతు చూడాలని కీర్తిసురేష్‌(వెన్నెల పాత్ర ధారిణి) కసితో తనకు దొరికి కత్తిని తీసుకుని పొడిచి చంపేస్తుందట. దీంతో కథ సుఖాంతం అవుతుంది. నిజానికి దసరా పండగకి కీర్తిసురేష్‌ చేతిలో విలన్‌ చనిపోవడం పర్‌ ఫెక్ట్ మ్యాచింగ్‌. విజయదశమి కథలోనూ అదే జరుగుతుంది. దర్శకుడు మొదట ఇలానే కథని రాసుకున్నాడట. షూటింగ్‌ కూడా జరిగిందట. 

కానీ హీరోయిన్‌తో క్లైమాక్స్ ముగింపు పలికితే ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని, వాళ్లు యాక్సెప్ట్ చేస్తారా? లేరా? అనే డౌట్‌ వ్యక్తమయ్యిందట. దీనికితో అసలు హీరో నాని లేకుండా క్లైమాక్స్ ముగింపు అంటూ ఫ్యాన్స్ ఒప్పుకోలేరని, అది నానిని ఇమేజ్‌కి దెబ్బ పడేలా ఉంటుందనే ఆలోచనతో, అంతిమంగా కీర్తి హీరో అవుతుందని, నాని ఒత్తిడి మేరకు కీర్తి క్లైమాక్స్ ని తీసేసి నాని పాత్రతో ముగింపు పలికారట. ప్రస్తుతం ఈ వార్త అటు టాలీవుడ్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కీర్తిసురేష్‌ పాత్రతో ముగింపు పలికి ఉంటే క్లైమాక్స్ అదిరిపోయేదంటున్నారు. మరికొందరు కీర్తితో అయితే ఫలితం ఆశించినట్టుగా ఉండేది కాదంటున్నారు. దీనిపై మిశ్రమ స్పందన లభిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios