Asianet News TeluguAsianet News Telugu

Dasara Collections: ఒక్క రోజుకే ఇంత తేడానా? నాని గట్టెక్కుతాడా?

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `దసరా` థియేటర్లలో రచ్చ చేస్తుంది. నాని తన పంథా మార్చి చేసిన ప్రయోగానికి మంచి స్పందనే లభిస్తుంది. మరి కలెక్షన్లు ఆ స్థాయిలో ఉన్నాయా? అనేది చూద్దాం. 

dasara movie 2days collections big change in one day will nani show his stamina ? arj
Author
First Published Apr 1, 2023, 7:40 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన లేటెస్ట్ మూవీ `దసరా` బాక్సాఫీసు వద్ద తన సత్తాని చాటుతుంది. యాభై కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. అయితే తొలి రోజు మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ38కోట్ల కలెక్షన్లు సాధించినట్టు చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజుతో యాభై నాలుగు కోట్లకు చేరుకుంది. అయితే ఒక్కరోజులు కలెక్షన్లలో వచ్చిన తేడా ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సగానికి సగం పడిపోవడం షాకిస్తుంది. 

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.38కోట్ల గ్రాస్‌ సాధించగా, ఇరవై 2కోట్లకుపైగా షేర్‌ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 14.22 కోట్ల షేర్‌ దక్కించుకుంది. రెండో రోజు కేవలం 5.82కోట్లు షేర్‌(9.60కోట్ల గ్రాస్‌) మాత్రమే వచ్చాయి. అంటూ మూడోవంతు కలెక్షన్లు పడిపోయాయని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలో, ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది ఓ సారి చూస్తే. 

దసరా మూవీ కలెక్షన్లు తెలుగు స్టేట్స్ లో..
Day1 - 14.22cr
Day2 - 05.82cr Huge Drop 

Day2 

Telangana - 03.48cr 
Raayalaseema - 00.66cr
Nellore - 00.12cr
Guntur - 00.24cr
Krishna - 00.28cr
West - 00.16cr
East - 00.28cr
Uttarandra - 00.64cr

Telugu States Day2 Total Theatrical Gross - 09.60cr

Telugu States Day2 Total Theatrical Share - 05.86cr

2Days Collections

Telangana - 10.26cr(Net)
( Brake Even - 13.70cr )

Raayalaseema - 03.02cr
( Brake Even - 06.70cr )

Nellore - 00.47cr
( Brake Even - 01.20cr )

Guntur - 01.33cr
( 00.40cr Fixed Hires )
( Brake Even - 03.00cr )

Krishna - 00.92cr
( Brake Even - 02.00cr )

West - 00.71cr
( Brake Even - 02.00cr )

East - 01.18cr
( Brake Even - 02.30cr )

Uttarandra - 02.06cr
( Brake Even - 03.90cr )

Telugu States 2Days Total Theatrical Gross - 34.45cr

Telugu States 2Days Total Theatrical Share - 20.08cr

Karnataka + Other Languags  - 02.80cr
( Brake Even - 03.35cr )

Hindi Belt - 00.60cr
( Brake Even - 04.00cr )

Overseas - 05.60cr
( Brake Even - 06.00cr )

WorldWide 2Days Total Theatrical Gross - 52.40cr

WorldWide 2Days Total Theatrical Share - 29.08cr

WorldWide Theatrical Share Breake Even - 50.00cr

`దసరా` సినిమాకి డైబ్బై, ఎనబై కోట్ల బడ్జెట్‌ అయినట్టు ప్రచారం చేశారు. కానీ సినిమా చూస్తే అంత కాలేదని తెలుస్తుంది. యాభై కోట్ల లోపే బడ్జెట్‌ అయి ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్ కలెక్షన్లు వచ్చాయంటే నిర్మాతలు సేఫ్‌ అని చెప్పొచ్చు. అదే సమయంలో ఓటీటీ రైట్స్, శాటిలైట్‌ రైట్స్ నిర్మాతలకు భోనస్‌గా మిగులుతాయి. ఓ రకంగా నిర్మాతలు లాభాల్లోనే ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ నానిగానీ, మేకర్స్ గానీ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈజీగా వంద కోట్ల మార్క్ ని దాటుతుందని భావించారు. కానీ పరిస్థితులు రివర్స్ అయ్యాయి. ఫలితం తేడా కొట్టడం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఎంత చేసినా బ్రేక్‌ ఈవెన్‌ వరకు చేరుకుంటుందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.

సినిమాకి తెలంగాణలో మంచి ఆదరణ దక్కుతుంది. కలెక్షన్ల పరంగా చూస్తే అది స్పష్టమవుతుంది. తెలంగాణ నేపథ్యంలో సింగరేణి బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో నైజాం(తెలంగాణ) ఏరియాలో ఈ సినిమా మంచి కలెక్షన్లని రాబడుతుంది. రేపటి వరకు ఇక్కడ తిరుగులేదు. కానీ ఏపీలో మాత్రం కలెక్షన్లు డ్రాస్టిక్‌గా పడిపోయాయి. పూర్తిగా ఇది తెలంగాణ నెటివిటీతో సాగడం, యాస్‌ కూడా అర్థమయ్యేలా లేకపోవడం, బలమైన కథ లేకపోవడంతో ఏపీ ఆడియెన్స్ ని మెప్పించలేకపోతుందనే కామెంట్లు వస్తున్నాయి. అందుకు కలెక్షన్లే నిదర్శనంగా చెబుతున్నారు.

కానీ నానికి తెలుగు రాష్ట్రాలు తప్పా మిగిలిన స్టేట్స్ లో మార్కెట్‌ లేదు. `అంటే సుందరానికి` ట్రై చేసినా వర్కౌట్‌ కాలేదు. ఇప్పుడు `దసరా` సినిమాకి బాగా ప్రమోట్‌ చేశాడు. నార్త్ లో బాగా దృష్టిపెట్టాడు. కానీ ఈ సినిమాకి ఆ ప్రభావం కనిపించడం లేదు.  మరీ హిందీ బెల్ట్ లో ఈ చిత్రం ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోతుంది. కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. కన్నడలో బెటర్‌గా ఉండటం విశేషం. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకి మంచి ఆదరణే దక్కుతుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమాకి పరీక్ష కాలం ప్రారంభమైందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మరీ వారి అంచనాలు మించి నాని సత్తాచాటుతాడా? అనేది చూడాలి. 

`దసరా` సినిమాతో నాని మొదటిసారి ఊరమాస్‌ లుక్‌ని ట్రై చేశారు. రా అండ్‌ రస్టిక్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెల. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటించింది. సినిమాలో
మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్లు ఉన్నా ఈ సినిమాకి కలిసొచ్చేలా కనిపించడం లేదు. రెండో రోజు దారుణంగా కలెక్షన్లు పడిపోవడంతో ఈ సినిమాకి గడ్డు పరిస్థితులు ఎదురైనట్టే అనిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios