నాని డైరక్టర్ తో ప్రభాస్ , స్క్రిప్టు పూర్తి
పాన్ ఇండియాకు సూట్ అయ్యే ఒక రస్టిక్ యాక్షన్ స్టోరీతోఆ కథను ఫినిష్ చేసి ఇప్పుడు #Prabhas ని అప్రోచ్ అవబోతున్నాడట.

ప్రభాస్ తో సినిమా చెయ్యాలని చాలా మంది దర్శకులకు ఉత్సాహం ఉంటుంది. అయితే అందరి దర్శకులకు టైమ్ ఇచ్చి సినిమా చేసే పరిస్దితిలో లేడు. ఎందుకంటే ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజిని దాటింది. దాంతో అందుకు తగ్గ కథ, డీల్ చేసే డైరక్టర్, భారీ నిర్మాతు ఉండాల్సిందే. బాహుబలి సూపర్ హిట్ తర్వాత సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నట్లుగా అనిపించినా ఒక్కసారిగా స్పీడు పెంచాడు ప్రభాస్. వరసగా సినిమాలు కమిట్ అవుతూ, మరో ప్రక్క పూర్తైన చిత్రాలు రిలీజ్ చేస్తూ తోటి హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఏ స్టార్ హీరోకీ లేనన్ని రిలీజ్ లు,కమిట్మెంట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్నాయి. తాజాగా మరో కొత్త ప్రాజెక్టు కి సైన్ చేయటానికి రంగం సిద్దమవుతోందని తెలుస్తోంది.
నాని వంటి ఫ్యామిలీ చిత్రాలు చేసుకునే హీరోతో #Dasaraతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల గత కొద్ది నెలలుగా ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియాకు సూట్ అయ్యే ఒక రస్టిక్ యాక్షన్ స్టోరీతోఆ కథను ఫినిష్ చేసి ఇప్పుడు #Prabhas ని అప్రోచ్ అవబోతున్నాడట. కథ నచ్చితే నెక్ట్స్ ఎప్పటినుంచి ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు చర్చకు వస్తాయి. అయితే ఖచ్చితంగా ప్రబాస్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉందిట టీమ్.
ఇక బాహుబలి తర్వాత రెండేళ్లకు రిలీజ్ అయ్యింది సాహో, ఆ తర్వాత గ్యాప్ తో రిలీజ్ అయింది రాదేశ్యామ్. ఇలా సినిమా రిలీజ్ కి టైమ్ తీసుకుంటున్న ప్రభాస్ ఈ సంవత్సరం ఫాన్స్ కి ట్రిపుల్ ఫీస్ట్ ఇస్తున్నారు. కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్పటికే ఆదిపురుష్ రిలీజ్ చేసారు. అలాగే డిసెంబర్ 22 న సలార్ రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ నీల్ , ప్రభాస్ కాంబినేషన్లో భారీగా తెరకెక్కుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ రిలీజ్ డేట్ ని ఇటీవలే నిర్మాత విజయ్ కన్ఫామ్ చేశారు.
ప్రభాస్ ఆల్రెడీ సలార్, ప్రాజెక్ట్ Kతో ప్యార్లల్ షూట్ చేస్తూనే మరో వైపు మారుతి సినిమా కూడా చేస్తున్నారు. ప్రాజెక్టు కే రిలీజ్ డేట్ ఇచ్చేసారు. అలాగే మారుతి తో చేస్తున్న సినిమా కూడా వచ్చే సంవత్సరమే రిలీజ్ కాబోతోంది అని సమాచారం. హార్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 3 హీరోయిన్లతో రొమాన్స్ చెయ్యబోతున్నారు ప్రభాస్. ఈ సినిమా మీద ఇంత వరకూ అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ప్రభాస్, మారుతి సెట్స్ లోఉన్న ఫోటోతో ఫాన్స్ కి మాత్రం క్లియర్ పిక్చర్ వచ్చేసింది..అలాగే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా కూడా ఉంది. ఇలా క్రేజ్ ఉన్న ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్న ప్రభాస్ స్పీడు చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.