Asianet News TeluguAsianet News Telugu

`దాస్‌ కా ధమ్కీ` కలెక్షన్లు.. విశ్వక్‌సేన్‌ సేఫా? లాసా?

విశ్వక్‌ సేన్‌ అన్నీ తానై చేసిన `దాస్‌ కా ధమ్కీ` చిత్రం విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి సినిమా హిట్టా? ఫట్టా? లాభాలా నష్టాలా అనేది చూద్దాం. 

das ka dhamki movie total collections vishwak sen safe or loss?
Author
First Published Apr 1, 2023, 5:54 PM IST

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న హీరో. సొంతంగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు. `ఫలక్‌నూమాదాస్‌` చిత్రంతో తానేంటో నిరూపించుకున్నాడు. తనని తాను ప్రమోట్‌ చేసుకున్నాడు. పెద్ద హీరోల అండని సంపాదించాడు. బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ వంటి స్టార్ల సపోర్ట్ తో ముందుకు సాగుతున్నాడు విశ్వక్‌ సేన్‌. ఇటీవల ఆయన అన్నీ తానై `దాస్‌ కా ధమ్కీ` చిత్రాన్ని రూపొందించారు. తన ఆలోచనలకు భిన్నంగా ఉన్న ఈ చిత్ర ఒరిజినల్ డైరెక్టర్‌ని తప్పించి మరీ తనే దర్శకత్వం వహించారు. 

తనే హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాడు విశ్వక్‌ సేన్‌. ఇందులో నివేతా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటించింది. విశ్వక్‌ సేన్‌ ద్విపాత్రాభినయం చేస్తూ రూపొందించిన చిత్రమిది. సుమారు రూ.25కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 22న ఈ చిత్రం విడుదలైంది. మొదట పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు విశ్వక్‌ సేన్‌. ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే విడుదల చేశారు. తొలి షోకి దీనికి మిశ్రమ స్పందన లభించింది.  కానీ ఫస్ట్ డే బాగానే కలెక్ట్ చేసింది.

`దాస్‌ కా ధమ్కీ` తొలి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నాయి. విశ్వక్‌ సేన్‌పై ఉన్న క్రేజ్‌, ఆయన చేసిన ప్రమోషన్స్ గత చిత్రాల విజయాల కారణంగా ఫస్ట్ డే బుకింగ్స్ బాగున్నాయి. తొలి రోజు ఈ చిత్రం 8కోట్లకుపైగా గ్రాస్‌ సాధించింది. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో టాక్‌కి, కలెక్షన్లకి సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజూ కలెక్షన్లు బాగానే ఉన్నాయి. సుమారు రూ.15కోట్ల గ్రాస్‌, మూడో రోజుకి 18కోట్ల గ్రాస్‌ వచ్చింది. కానీ నాల్గో రోజు నుంచి ఈ చిత్రం దారుణంగా పడిపోయింది. ఒక్కసారిగా కుప్పకూలినట్టయ్యింది. ఈ సినిమా పది రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు రూ.22కోట్ల గ్రాస్‌ సాధించినట్టు ట్రేడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

ఈ సినిమా సుమారు 12కోట్ల నెట్‌ సాధించింది. ఎనిమిది కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్‌ బిజినెస్‌ పరంగానా మంచి లాభాలనే సాధించిందని చెప్పొచ్చు. ఈ విషయంలో బయ్యర్లు సేఫ్‌లోనే ఉన్నట్టు తెలుస్తుంది. థియేట్రికల్‌గా `ధమ్కీ` చిత్రం హిట్‌గానే చెప్పొచ్చు. కానీ పెట్టిన బడ్జెట్‌కి, వచ్చిన కలెక్షన్ల పరంగానూ చూస్తే మాత్రం విశ్వక్‌ సేన్‌ హ్యాపీగా లేడని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్‌ రైట్స్ కలుపుకుని పది కోట్ల వరకు అమ్ముడు పోయాయి. థియేట్రికల్‌గా మరో 12 వచ్చింది. 

అంటే ఎంత చూసినా ఈ చిత్రం 20-22కోట్ల వరకు మాత్రమే చేసింది. కానీ సినిమా బడ్జెట్‌ అంతకు మించి అయ్యింది. దీనికి ఇంట్రెస్ట్ లు కలుపుకుంటే మరో రెండు మూడు కోట్లకుపైగానే అవుతుంది. పైగా విశ్వక్‌ సేన్‌ రెమ్యూనరేషన్‌ కూడా అందులోనే. దీంతో ఈ చిత్రం నిర్మాతగా విశ్వక్‌ సేన్‌కి నష్టాలనే మిగిల్చినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకే విడుదలైన నెక్ట్స్ డేనే హడావుడి చేసిన విశ్వక్‌ సేన్‌ ఆ తర్వాత సైలెంట్‌ అయ్యాడు. అదే సినిమా హిట్‌ అయితే సక్సెస్‌ సెలబ్రేషన్స్, థియేటర్ల హడావుడి చేసేవాడు, ఆయన లెక్క వేరే ఉండేది. తనపై వచ్చిన విమర్శలకు, అణచి వేత ధోరణి నేపథ్యంలో విశ్వక్‌ సేన్‌ ఆ సక్సెస్‌ని గట్టిగా ఎంజాయ్‌ చేసేవాడు. కానీ ఆ సంతోషం ఆయనకి `ధమ్కీ` ఇవ్వలేకపోయిందని సమాచారం. 

మున్ముందు కూడా ఈ సినిమా రీచ్‌ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా చోట్ల ఈ చిత్ర షోలు తీసేసి `బలగం` షోలు వేస్తున్నారట. దీనికితోడు నాని `దసరా` వచ్చి పడింది. ఈ కారణంతో `దాస్‌ కా ధమ్కీ` కి దెబ మీ దెబ్బలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆల్మోస్ట్ ఈ సినిమా క్లోజింగ్‌కి చేరుకుందని చెప్పొచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios