‘వినోరో భాగ్యము విష్ణు కథ’ నుంచి మరో క్రేజీ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘దర్శన’!

వరుస చిత్రాలతో అలరిస్తున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్రం నుంచి విడుదలవుతున్న సాంగ్స్ ఆకట్టుకుంన్నాయి. లేటెస్ట్ గా బ్రేకప్ సాంగ్ రిలీజైంది.
 

Darshana lyrical video song from Vinaro Bhagyamu Vishnu Katha movie

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇటీవల మూవీ నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన పాటలు ‘మాయదారి మనసే’,‘హో బంగారం’ ఆకట్టుకుంటున్నాయి. లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం నుంచి పాటలు కూడా అదే తరహా రిలీజ్ అవుతున్నాయి. 

తాజాగా చిత్ర యూనిట్ బ్రేక్ అప్ సాంగ్ ను విడుదల చేసింది. ‘దర్శన’ టైటిల్ తో విడుదలైన ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. చైతన్య భరద్వాజ్ అందించిన క్యాచీ ట్యూన్ తోపాటు అనురాగ్ కులకర్ణి అద్భుతమైన గాత్రం పాటను మరో స్థాయికి తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా పాటకు తగ్గట్టు నటనతో ఆకట్టుకున్నారు. యూత్ ను ఆకట్టుకునేలా సాంగ్ ను అందించడం విశేషం. అయితే క్రమక్రమంగా VBVK నుంచి వస్తున్న పాటలు సంగీత ప్రియుల మ్యూజిక్ ప్లేలిస్టులో చోటు సంపాదించుకునేలా ఉన్నాయి.

వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం - క‌శ్మీర ప‌ర్ధేశీ (Kashmira) జంటగా నటిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కుతోన్న సినిమా ఇది. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2023 ఫిబ్రవరి 17న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios