లోక్ సభ ఎన్నికలు మొదలైనప్పటి నుండి సీఎం కుమారస్వామికి, నటుడు దర్శన్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. మండ్య నియోజకవర్గం నుండి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేయగా.. అదే నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా సుమలత పోటీ చేశారు.

ఆ సమయంలో దర్శన్.. సుమలత తరఫున ప్రచార కార్యక్రమాలు చేయడంతో కుమారస్వామి నేరుగానే దర్శన్ పై విమర్శలు చేశారు. దర్శన్ కూడా వెనుకడుగు వేయకుండా ప్రతిఘటించాడు. ఎన్నికల ప్రచారాల చివరిరోజుల కుమారస్వామి చేసిన కామెంట్స్ కి ధీటుగా బదులిచ్చాడు. తాజాగా దర్శన్ మరోసారి కుమారస్వామిపై విరుచుకుపడ్డారు. 

రైతులకు రుణమాఫీ అవసరం లేదని ఎంతకాలం అదే చెప్పుకుంటారని పంటలకు గిట్టుబాటు ధర ప్రాధాన్యమని అన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఏ అన్నదాత ఎవరినీ ఏమీ కోరరని రుణమాఫీ వంటి వాటిపై ఆశలు పెట్టుకోరని అన్నారు.

దర్శన్ చేసిన వ్యాఖ్యలకు సుమలత మద్దతు పలికారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పూర్తిగా నష్టం వచ్చేలాంటి ధరలకు కొనుగోలు చేస్తే వారు అప్పులుపాలు కాక ఏమవుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏదైనా.. రైతులను ఆదుకోవాలని అన్నారు