సలార్ ని ఢీ కొట్టిన 'కాటేరా' ఓటీటీ రిలీజ్ కి రెడీ.. డేట్ ఫిక్స్, ఎందులో అంటే
కన్నడ నాట విడుదలైన కాటేరా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. సలార్ ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సలార్ ని సైతం ఢీ కొట్టి బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది.
కన్నడ నాట విడుదలైన కాటేరా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. సలార్ ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సలార్ ని సైతం ఢీ కొట్టి బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలిచింది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు.
కన్నడ అత్యధిక గ్రాసర్స్ లో కాటేరా చిత్రం కూడా ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం రిలీజ్ కి ముందు దర్శన్ సలార్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. సలార్ ఉంటే ఏంటి మా చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుంది అని దర్శన్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. ఆ నమ్మకమే నిజమైంది.
200 కోట్లకి పైగా ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి కూడా రెడీ అవుతోంది. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయనున్నారు. జీ5 ఒటిటిలో ఈ చిత్రం ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సలార్ తో పోటీ పడ్డ ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మంది ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి మాలశ్రీ కుమార్తె ఆరాధన రామ్ హీరోయిన్ గా నటించింది. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. థియేటర్స్ లో దుమ్ములేపిన ఈ చిత్రం ఓటిటిలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.