శర్వానంద్ కోసం ‘కళ్యాణం కమనీయం’ నుంచి ‘వెడ్డింగ్ యాంథెమ్’.. లాంచ్ చేసిన డార్లింగ్ ప్రభాస్!
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘కళ్యాణం కమనీయం’. చిత్రం నుంచి తాజాగా క్రేజీ ‘వెడ్డింగ్ యాంథెమ్’ విడుదలైంది. సాంగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లాంచ్ చేశారు. శర్వానంద్ సాంగ్ ప్రారంభంలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

గతేడాది ‘లైక్ షేర్ అండ్ సబ్ స్రైబ్’తో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan) తాజాగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలకు ఉన్నా.. ఏమాత్రం తగ్గకుండా రిలీజ్ కు సిద్ధమైంది. జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు. Kalyanam Kamaneeyama చిత్రంలో సంతోష్ కు జోడీగా కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథను దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కిస్తున్నారు. మూడు రోజుల్లో సినిమా విడుదల కాబోతుండటంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్అందిస్తున్నారు.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. నిన్నే ‘అయ్యో ఏంటో’ మెలోడీ సాంగ్ విడుదైంది. ఇక తాజాగా మరో ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘వెడ్డింగ్ యాంథెమ్’ (Wedding Anthem)గా వచ్చిన ఈ సాంగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎంచుకున్న కథ, ప్రమోషనల్ సాంగ్ చాలా బాగుందన్నారు. యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే ఈ వెండింగ్ యాంథెమ్ వీడియో ప్రారంభానికి ముందు శర్వానంద్ కనిపిస్తారు. అప్పటికే పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలతో సతమతం అవుతున్న సంతోష్ తో మాట్లాడుతుంటారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శర్వా ‘వెడ్డింగ్ యాంథెమ్’ వీడియోలో కనిపించడం ఆసక్తికరంగా మారింది.
పెళ్లి ఆవశ్యకతను తెలియజేసే ఈ సాంగ్ ను కృష్ణకాంత్ రచించగా, శ్రీ చరణ్ పాకాల పాడారు. ఈ పాటకు యామిని ఘంటసాల మరియు రవి ప్రకాష్ అదనపు గాత్రాలు అందించారు. యష్ దీనికి కొరియోగ్రాఫర్, శ్రీచరణ్ పాకాల క్యాచీ ట్యూన్ అందించారు. ప్రస్తుతం సాంగ్ దూసుకుపోతోంది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. 1 గంట 46 నిమిషాల నిడివిగల ఈ చిత్రం ప్రతి విషయంలోనూ ఆసక్తిని పెంచుతోంది.