సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గత సినిమాలతో సౌత్ ఇండియన్ ఆడియెన్స్ ని తీవ్రంగా నిరాశపరిచారనే చెప్పాలి. కబాలి - కాలా - పేట సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ సాధించకపోవడంతో ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో అభిమానులను మెప్పించాలని తలైవా కష్టపడుతున్నారు. ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమాను కూడా రజిని వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబై లో సినిమాకు సంబందించిన క్లయిమ్యాక్స్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదే ఫైనల్ షెడ్యూల్. ఈ కాస్త చిత్రీకరణ అయిపోతే దాదాపు సినిమా షూటింగ్ మొత్తం అయిపోయినట్లే అని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. 

ఇక సినిమాలో చాలా ఏళ్ల తరువాత రజీనీకాంత్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాలో ఆయన రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిననున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేయాలనీ దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.