దంగల్ గర్ల్ జైరా లైంగిక వేధింపుల కేసు నిందితుడు అరెస్ట్

దంగల్ గర్ల్ జైరా లైంగిక వేధింపుల కేసు నిందితుడు అరెస్ట్

దంగల్ గర్ల్ నటి జైరా వాసిమ్ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియా ఎకౌంట్ ట్విటర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త దేశమంతా వ్యాపించడంతో కేసునమోదు చేసిన దిల్లీ పోలీసులు నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిసింది.

 

దిల్లీ నుంచి ముంబై కి విస్తారా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో జైరాను వేధించిన వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిని 39 సంవత్సరాల ముంబై వ్యాపారవేత్త వికాస్ సచ్ దేవ్‌గా గుర్తించారు. బాధితురాలు జైరా వయసు 17 సంవత్సరాలు. అతనిపై పోస్కో సహా పలు సెక్షన్లపై కేసు పెట్టినట్టు న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ అనిల్ వెల్లడించారు.

 

నిందితున్ని ఇవాళ(సోమవారం) కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, విమానంలో తన సీటు హ్యాండ్ రెస్ట్ పై వెనక కూర్చున్న వ్యక్తి కాలు పెట్టాడని, మెడ, చేతులు, వీపుపై అసభ్యంగా తాకాడని జైరా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కంటతడి పెడుతూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై విస్తారా విమానయాన సంస్థ కూడా స్పందించింది. ఈ తరహా సంఘటనలను తాము ప్రోత్సహించమని, విచారణలో జైరాకు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపింది.­­­

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page