Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు దంగల్ టాప్.. దంగల్ కు బాహుబలి చైనా సవాల్

  • చైనాలో కలెక్షన్స్ సునామీ సృష్టించిన దంగల్
  • బాహుబలి రికార్డులకు దంగల్ దెబ్బ
  • చైనాలోనే వార్ కొనసాగించేందుకు రెడీ అవుతున్న బాహుబలి2
dangal crossed bahubali overall collections after china release

రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ బాహుబలి-2 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో థియేటర్ల ముందు క్యూ కట్టారో చూశాం. అందుకే ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. వందకోట్లు దాటడం గగనమనుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెయ్యి కోట్ల మార్కును రుచి చూపించింది బాహుబలి. హిందీలోనూ విడుదలయి బాలీవుడ్ ఖాన్ త్రయం రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా బాహుబలిని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా తేల్చేశారు. అయితే బాహుబలి రికార్డుకు ఓ సినిమా చెక్ పెట్టింది. 

 

ఆమీర్ ఖాన్ సాధించిన అత్యదిక ఇండియా వైడ్ కలెక్షన్స్ రికార్డును క్రాస్ చేసిన బాహుబలి చిత్రానికి ఇప్పుడు అదే అమీర్ నటించిన దంంగల్ చిత్రం రికార్డులు సవాల్ విసురుతున్నాయి. ఇటీవల చైనాలో విడుదలయిన దంగల్ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తోంది. మూడు వారాల్లోనే  అక్కడ ఈ సినిమా ఏకంగా 1100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ ట్రాకర్ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. అంతే కాదు దంగల్ చైనాలో హాలీవుడ్ సినిమాల కలెక్షన్ల రికార్డులన్నీ బ్రేక్ చేసిందని తేల్చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ దంగల్‌కు 1800 కోట్ల రూపాయలు వచ్చాయని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. బాహుబలి-2కి ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1575 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయనీ, దీంతో దంగల్ సినిమా ప్రస్తుతానికి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలుస్తుందని ఉమైర్ సంధు తేల్చేశాడు.

 

అయితే బాహుబలి2ని చైనాలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో బాహుబలి2 కూడా చైనాలో సందడి చేయనుంది. బాహుబలి1 సరైన ప్లానింగ్ లేక చైనాలో సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. బాహుబలి-2 కనుక చైనాలో కలెక్షన్ల మోత మోగిస్తే దంగల్‌ను దాటిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా పార్ట్-1, పార్ట్-2 కలెక్షన్లను లెక్కించుకుంటే బాహుబలినే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అవుతుందన్నది బాహుబలి అభిమానుల వాదన. ఏదేమైనా బాహుబలి, దంగల్మచిత్రాలు ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా చూపినందుకు భారతీయులుగా మనమంతా గర్వపడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios