500 కోట్ల క్లబ్ లో చేరిన ఆమిర్ ఖాన్ దంగల్ మూవీ పీకే చిత్రం సాధించిన రూ.720కోట్ల కలెక్షన్ దాటే అవకాశం ట్రెండ్ ఇలానే కొనసాగితే రికార్డులు సృష్టించనున్న దంగల్

బాలీవుడ్ ఖాన్స్ లో ఆమీర్ ఖన్ రూటే సెపరేటు. సినిమా అంటే ఇదిరా అనేలా ప్రతీసారి ఏదో కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు ఆమిర్. ఈ సారి ఆమిర్ దంగల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తోంది . డిసెంబర్ 23న రిలీజ్ అయిన దంగల్ 465 కోట్ల గ్రాస్ వసూళ్ల తో సంచలనం సృష్టిస్తోంది . 9 రోజుల్లోనే ఈ మొత్తం సాధించడంతో అమీర్ ఖాన్ తో పాటు ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు .

ఈ జోరు ఇలాగే కొనసాగితే పీకే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సాధించిన 720 కోట్ల మైలురాయి ని కూడా దాటడం పెద్ద కష్టం కాదు అని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . రిలీజ్ అయి పది రోజులైనా బాక్సాఫీస్ దగ్గర దంగల్ జోరు మాత్రం తగ్గలేదు . 

పీకే వరల్డ్ వైడ్ 720 కోట్ల ని రాబట్టింది , అది అమీర్ ఖాన్ నటించిన చిత్రమే కావడం విశేషం కాగా ఇప్పుడు దంగల్ కూడా అమీర్ ఖాన్ చిత్రమే కావడం మరో విశేషం . పెద్ద నోట్లు రద్దై జనాలు కష్టాలు పడుతున్నా... డీమానిటైజేషన్ ప్రభావం ఏ మాత్రం పడకుండా... దంగల్ ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుండటంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్య పోతున్నారు . ఈరోజో రేపో దంగల్ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది . ఆ తర్వాత పీకే రికార్డ్ ని బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదు .