తారక్ భయ్యా అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఎన్టీఆర్ కు ఓదార్పు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 30, Aug 2018, 9:07 PM IST
Dallas concert to be dedicated to Harikrishna
Highlights

డల్లాస్ కన్సర్ట్ ను నందమూరి హరికృష్ణకు అంకితం చేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  

హైదరాబాద్: డల్లాస్ కన్సర్ట్ ను నందమూరి హరికృష్ణకు అంకితం చేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  

"డల్లాస్‌ కన్సర్ట్‌ను నందమూరి హరికృష్ణ  గారికి అంకితం ఇస్తున్నా"నని ఆయన హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

 

"కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌" అని అన్నారు. 

"తారక్‌ భయ్యా, కల్యాణ్‌రామ్‌ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్‌ కన్సర్ట్‌ను ఆయనకు అంకితం చేస్తున్నా" అని ట్వీట్ చేశారు.

 

loader