ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఎంతగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడేం జరిగినా.. నిమిషాల్లో జనాలకి తెలిసిపోతుంది. తాజాగా హాలీవుడ్ నటి డకోటా జాన్సన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో డకోటా ప్రైవేట్ పార్టీ పై దర్శకుడు చేయి వేసినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.

దీంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి. కానీ హాలీవుడ్ వర్గాల వెర్షన్ మాత్రం మరో రకంగా ఉంది. డకోటా జాన్సన్ నటించిన తాజా చిత్రం 'సస్పిరియా'. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు ఆమె కూడా పాల్గొంది. రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో డకోటా డ్రెస్ జారబోతుంటే దర్శకుడు ఆమె ప్రైవేట్ పార్ట్ కి చేయి అడ్డంగా పెట్టారని, అంతే తప్ప టచ్ చేయలేదని.. ఫొటోల్లో అలా కనిపిస్తుందని హాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ విషయాన్ని హీరోయిన్ కూడా పెద్దగా పట్టించుకోలేదని సిగ్గుతో తన డ్రెస్ సరి చేసుకొని దర్శకుడి వెనక్కి వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. హీరోయిన్ పరువు కాపాడడానికి మాత్రమే డైరెక్టర్ అలా చేశారని అందులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని చెబుతున్నారు.