ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో దగ్గుపాటి రానా తమ్ముడుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అభిరామ్ దగ్గుబాటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. సైబరాబాద్ పరిధిలోని మణికొండ లో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారుకు త‌ృటిలో పెను ప్రమాదం తప్పింది.

 మణికొండలోని పంచవటి కాలనీలో అభిరామ్ ప్రయాణిస్తోన్న కారును ఎదురుగా వచ్చిన మరో కారు ఢీ కొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదమే నని ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదంకానీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. 

సంఘటన వివరాల్లోకి వెళితే...కరీంనగర్‌ జిల్లా, ఆరేపల్లికి చెందిన రాజు మెకానిక్‌ లక్ష్మణ్‌ను తీసుకొని కారు కొనుగోలు చేసేందుకు నగరానికి వచ్చాడు. మణికొండలో యజమాని నుంచి కారు తీసుకుని టెస్ట్‌ డ్రైవ్‌ కోసం స్నేహితుడు సతీ్‌షతో కలిసి వెళ్లాడు. 

పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్‌ హౌస్‌ పక్కరోడ్డు నుంచి దగ్గుబాటి అభిరామ్‌ కారులో రాగా పరస్పరం రెండు కార్లు ఢీకొన్నాయి. అభిరాం, రాజు రాయదుర్గం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరికీ బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా మద్యం తాగలేదని తేలింది. ఇరువురూ రాంగ్‌ రూట్‌లో వచ్చారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.