Asianet News TeluguAsianet News Telugu

తేజ దర్శకత్వంలో అభిరామ్ డెబ్యూ మూవీ... టైటిల్ ఏమిటంటే?

డెబ్యూ హీరోలతో ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తేజ, అభిరామ్ కోసం మాత్రం సోషల్ సబ్జెక్టు సిద్ధం చేశారట. ఇక ఈ చిత్ర టైటిల్ అహింస అంటూ ప్రచారం సాగుతుంది. 

daggubati abhiram debut with director teja movie titled ahimsa ksr
Author
Hyderabad, First Published Jul 5, 2021, 9:09 AM IST


దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ దగ్గుబాటి తెరంగేట్రం గురించి చాలా కాలంగా చర్చ నడుస్తుంది. అయితే హీరో కావాల్సిన వయసు ఎప్పుడో దాటేసిన అభిరామ్ మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఎట్టకేలకు దానికి ముహూర్తం కుదిరింది. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో ఆయన డెబ్యూ మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన లాంఛింగ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగినట్లు సమాచారం. 


డెబ్యూ హీరోలతో ప్రేమ కథా చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తేజ, అభిరామ్ కోసం మాత్రం సోషల్ సబ్జెక్టు సిద్ధం చేశారట. ఇక ఈ చిత్ర టైటిల్ అహింస అంటూ ప్రచారం సాగుతుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందట. తేజ చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన ఆర్పీ పట్నాయక్ ఈ మూవీకి సంగీతం అందించడం విశేషం. 


ఈ చిత్రానికి పనిచేయనున్న ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉదయ్ కిరణ్, నితిన్ వంటి యంగ్ హీరోలను వెండితెరకు పరిచయం చేసిన తేజా అభిరామ్ ని లాంచ్ చేయడం విశేషంగా మారింది. గతంలో మహేష్-తేజా కాంబినేషన్ లో వచ్చిన నిజం సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే. ఈ మధ్య రానాతో పొలిటికల్ థ్రిల్లర్ తీసిన ఆయన, అభిరామ్ కోసం సోషల్ సబ్జెక్ట్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios