పుష్ప సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో ఎంటర్ అయ్యారు సుకుమార్. అల్లు అర్జున్- రష్మిక మందన హీరోహీరాయిన్లుగా మాస్ వండర్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేశారు.

ఎన్నో అంచనాల నడుమ నిన్న (డిసెంబర్ 17) ప్రపంచవ్యాప్తంగా పుష్ప మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ సినిమాలో పుష్ప రాజ్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు బన్నీ. అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీ ఓపెనింగ్స్ దక్కాయి. పుష్ప సినిమా తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలయింది. అయితే బన్నీ క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. 

ఇదిలా ఉండగా ‘పుష్ప ది రైజ్’ సినిమా ద్వారా మెసేజ్ ఇచ్చారు సైబ‌రాబాద్ పోలీసులు. అది ప్ర‌శ్న రూపంలో.. పుష్ప మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర ట్రైల‌ర్‌లో పార్టీ లేదా? పుష్ప అని అంటాడు.. దానిపై చాలా మీమ్స్ కూడా వ‌చ్చాయి. ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు దాన్ని పాజిటివ్ యాంగిల్‌లో ఉప‌యోగించుకున్నారు. 

Scroll to load tweet…

అదెలాగంటే.. పుష్ప సినిమాలో బ‌న్నీ బైక్ తోలే పోస్ట‌ర్ ఉంది. అందులో ఆయ‌న హెల్మెట్ వేసుకోడు.. బైక్‌కి సైడ్ మిర్ర‌ర్స్ ఉండ‌వు. ‘హెల్మెట్‌, సైడ్ మిర్ర‌ర్స్ లేవా పుష్ప‌.. ’ అంటూ ఫహాద్ ఫాజిల్ ప్రశ్నించేలా మీమ్‌ పోస్టర్‌ను త‌యారు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు దాన్ని త‌మ అధికారిక వెబ్ సైట్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు హెల్మెట్ ధ‌రించండి, రే వ్యూ మిర్ర‌ర్ ఫిక్స్ చేసుకుని సుర‌క్షితంగా ఉండండంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు స‌ద‌రు ట్వీట్ ఇంటర్నెంట్ లో తెగ వైర‌ల్ అవుతుంది. ట్రెండింగ్‌లో ఉన్న సినిమాను.. అందులో అంశాన్ని ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల‌కు మెసేజ్ ఇచ్చేలా చేసిన సైబ‌రాబాద్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 'పుష్ప' హవా నడిచింది. మొదటిరోజు ఈ సినిమా 30 నుంచి 35 కోట్ల వరకు వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.