'గేమ్ ఛేంజర్' తోనే గేమ్స్ ఆడారు..రాంచరణ్, శంకర్ మూవీ సాంగ్ లీక్ చేసిన ఇద్దరూ అరెస్ట్

ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వరుస లీకులు చిత్ర యూనిట్ ని బాగా ఇబ్బంది పెట్టాయి. సాంగ్ లీక్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే సైబరాబాద్ పోలీసులకు ఎట్టకేలకు కేసుని ఛేదించారు.

Cyber Police arrest two for leaking Ram Charan game changer song dtr

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్.. మరో పక్క కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతూ వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా శంకర్ ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. 

ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వరుస లీకులు చిత్ర యూనిట్ ని బాగా ఇబ్బంది పెట్టాయి.  రాంచరణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక పాత్రలో రాంచరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తండ్రి పాత్రలోని లుక్ ఇంటర్నెట్ లో లీక్ అయింది. ఆ తర్వాత ఒక సాంగ్ లీక్ అయింది. తరచుగా చిత్రానికి సంబందించిన పిక్స్ ఇంటర్నెట్ లో లీక్ అవుతూనే ఉన్నాయి. దీనితో నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సాంగ్ లీక్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే సైబరాబాద్ పోలీసులకు ఎట్టకేలకు కేసుని ఛేదించారు.  ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు.సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. జరగండి అంటూ సాగే ఈ పాట కోసం శంకర్ కోట్లాది రూపాయల సెట్ వేయించినట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఈ సాంగ్ విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతున్నట్లు టాక్. 

న‌టీ న‌టులు:
రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios