Asianet News TeluguAsianet News Telugu

మా ఎన్నికల్లో ట్విస్ట్.. అసోసియేషన్ సభ్యత్వానికి సీవీఎల్ నరసింహారావు రాజీనామా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (maa Elections) ఎన్నికల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మా అధ్యక్ష బరిలో నిలిచిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు (cvl narasimha rao) మా సభ్యత్వానికి (membership) రాజీనామా (resign) చేసి సంచలనం సృష్టించారు.

cvl narasimha rao resigned as maa association member
Author
Hyderabad, First Published Oct 8, 2021, 7:41 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (maa Elections) ఎన్నికల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మా అధ్యక్ష బరిలో నిలిచిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు (cvl narasimha rao) మా సభ్యత్వానికి (membership) రాజీనామా (resign) చేసి సంచలనం సృష్టించారు. మాలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

పరీక్షరాయకముందే ఫెయిల్‌ అయ్యానని..  ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దర్శకుడు దాసరి నారాయణరావు అందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని సీవీఎల్ చెప్పారు. ఇలాంటి గందరగోళ, ఇబ్బందికర, దరిద్రమైన పరిస్థితులకి నేనూ దోహదం చేశాను కాబట్టి ఇకపై ఓటు వేయను అని ఆయన అన్నారు. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించి, సీవీఎల్‌ అనూహ్యంగా బరిలో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దాంతో, ప్రకాశ్‌రాజ్‌ (prakash raj), మంచు విష్ణు (manchu vishnu) మధ్యే పోటీ నెలకొంది. అక్టోబర్ 10న హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మా ఎన్నికలు జరగనున్న సంగతి  తెలిసిందే. మరుసటి రోజు అంటే అక్టోబర్ 11న ఫలితాలు వెలువడనున్నాయి.

ALso Read:Maa Elections: ఇప్పుడు దాసరి విలువ టాలీవుడ్‌కి తెలుస్తోంది.. సీవీఎల్ నర్సింహారావు కీలక వ్యాఖ్యలు

కాగా, మా ఎన్నికల్లో మరోసారి ప్రాంతీయవాదానికి తెర లేచింది. గురువారం ఉదయం నటుడు, దర్శకుడు రవిబాబు (ravi babu) మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తెలుగువారినే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ కాసేపటికే సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు సైతం స్పందించారు. ‘‘ మా ’’ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్‌‌కు దేశమన్నా, ధర్మమన్నా, దేవుడన్నా చులకన భావమని సీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్‌ను ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుండేదని సీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకుంటారని ఆశిస్తున్నానని నరసింహారావు వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios