ఎన్టీఆర్ బయోపిక్: వెన్నుపోటు ఎపిసోడ్ ఎలా చూపిస్తారో?

crucial part in ntr biopic
Highlights

నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందిస్తోన్న సంగతి 

నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా తేజను అనుకుంటే ఇప్పుడు ఆ స్థానంలోకి క్రిష్ వచ్చి చేరాడు. ప్రస్తుతం క్రిష్ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో మునిగిపోయాడు. అయితే ఈ సినిమాలో తమ పాత్రలను నెగెటివ్ గా చూపించబోతున్నారంటూ కొందరు రాజకీయ నాయకులు ఫిర్యాదు చేశారు. 

ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అనుమానాలు అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన వస్తే అందులో నారా చంద్రబాబు నాయుడు టాపిక్ రావడం గ్యారంటీ. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది వెన్నుపోటు ఎపిసోడ్. మరి ఈ సినిమాలో క్రిష్ ఆ ఎపిసోడ్ ను ఎలా డీల్ చేస్తాడో చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.

ఇటీవల క్రిష్.. చంద్రబాబుతో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ కు సంబంధించి చంద్రబాబు చెప్పినట్లుగా చూపించడం అంత కన్విన్సింగ్ గా ఉండదని క్రిష్ భావించాడట. బాలకృష్ణతో కూడా దీనికి సంబంధించి చర్చలు జరిపారట. అటు చంద్రబాబు హర్ట్ అవ్వకుండా ఇటు కథకు న్యాయం జరిగేలా క్రిష్ ఈ ఎపిసోడ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూడక తప్పదు!
 

loader