ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రీమేక్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ ని సెట్ చేసి ప్రకటన ఇచ్చారు. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో హిట్ కొట్టిన  సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతున్న సమాచారం. ఈ స్క్రిప్టు నిమిత్తం పవన్ కొన్ని సూచనలు ఇచ్చారని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. 

అయితే హీరోగా ఒకరినే చేసి,మరొకరిని నెగిటివ్ క్యారక్టర్ గా మార్చమని కోరినట్లు  చెప్పుకుంటున్నారు. దాంతో స్క్రిప్టు మొత్తం మారిపోనుంది. పవన్ హీరోగా , మరో పాత్ర విలన్ గా కనపడతుంది. ఇద్దరు ఇగోయిస్ట్ ల మద్య జరిగే యుద్దం కాస్తా వన్ సైడ్ వార్ గా మారిపోయి..హీరో ఓరియెంటెడ్ సినిమా అయ్యిపోతుంది. అయితే ఇదంతా మీడియా సృష్టించిన వార్తే అంటున్నారు. పవన్ అంత చెత్త సలహా పొరపాటున కూడా ఇవ్వరు. ఆయన సెన్సిబులిటీస్ వేరేగా ఉంటాయి.

మరో ప్రక్క సినిమాలోని ఓ కీలకపాత్రలో రానా నటించనున్నారంటూ గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై రానా  స్పందించారు. ‘నిజమే.. పవన్‌ సినిమాలోని ఓ పాత్ర కోసం చిత్రం టీమ్ నన్ను సంప్రదించింది. అయితే అది ఇంకా ఫైనల్‌ కాలేదు. నిజం చెప్పాలంటే ఆ పాత్ర చేయడం నాక్కూడా ఎంతో ఇష్టం’ అని ఆయన వెల్లడించారు. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పన్‌ కొషియమ్’ రీమేక్‌గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. అందులో బిజు మేనన్‌ పోషించిన పాత్రలో పవన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారని సమాచారం.
  
 
  స‌చీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది.  యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా న‌టించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్‌ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర‌నాగ‌వంశీ ద‌క్కించుకున్నార‌ు.  

మరో ప్రక్క ..సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.  ప్ర‌స్తుతం నితిన్ ,కీర్తి సురేష్‌ల‌తో రంగ్‌దే, నానితో శ్యామ్ సింగ‌రాయ్‌. నాగ‌శౌర్య‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్‌దే , శ్యామ్ సింగ‌రాయ్‌ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.