మర్డర్స్.. మాఫియా.. మహేష్ బాబు డీల్ చేయబోయే ప్రపంచం ఇదే!
మహేష్ బాబు త్వరలో పూర్తి స్దాయి క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. మాఫియాని, మర్డర్స్ ని డీల్ చేయబోతున్నారు. అవును..ఓ అచ్చం హాలీవుడ్ సినిమాలాంటి ఓ క్రైమ్ ప్రపంచాన్ని మహేష్ బాబు కోసం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రెడీ చేస్తున్నట్లు సమాచారం.

మహేష్ బాబు త్వరలో పూర్తి స్దాయి క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. మాఫియాని, మర్డర్స్ ని డీల్ చేయబోతున్నారు. అవును..ఓ అచ్చం హాలీవుడ్ సినిమాలాంటి ఓ క్రైమ్ ప్రపంచాన్ని మహేష్ బాబు కోసం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రెడీ చేస్తున్నట్లు సమాచారం. నేర ప్రపంచం నేపథ్యంలో మహేష్ కూడా ఓ మాఫియా సామ్రాజ్య అధినేతగా ఓ కథ సిద్ధం చేశారని తెలుస్తోంది!
వివరాల్లోకి వెళితే...కొంతకాలంగా మహేష్, సందీప్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్‌రెడ్డి’చూసిన మహేష్ కు ఆ సినిమా డీల్ చేసిన విధానం బాగా నచ్చేసింది. దాంతో దర్శకుణ్ణి తన ఇంటికి పిలిచిన ప్రత్యేకంగా అభినందించారు. తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. దాంతో వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమా కథ కూడా సిద్దం చేసారు. సందీప్‌రెడ్డి వంగా చెప్పిన క్రైమ్ డ్రామాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఇప్పటివరకూ తెలుగు తెరపై ఊహించని కథతో ఈ సినిమా సాగుతుందంటున్నారు. అందుకలో ఆయన పాత్ర, పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయట!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. అలాగే సుకుమార్ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో షూటింగ్ మొదలవుతుంది.
సందీప్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను అల్లు అరవింద్ నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినా..ఇదే బ్యానర్ లో ఈ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే ఉంటుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను మెగా బ్యానర్‌లో నిర్మిస్తే మరింత హైప్ క్రియేట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.