`యాత్ర2`కి సంబంధించిన అప్ డేట్లు చాలా కాలంగా ఊరిస్తున్నాయి. తాజాగా క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు మహి వీ రాఘవ్. ఒక్క ట్వీట్ తో సర్‌ప్రైజ్‌కి రెడీ కావాలనే సిగ్నల్స్ ఇచ్చేశాడు.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన `యాత్ర` సినిమాకి మంచి స్పందన లభించింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించగా, అనసూయ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ఆయన చేసిన ఓదార్పు యాత్ర నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది `యాత్ర 2` పేరుతో దీన్ని తెరకెక్కించబోతున్నారు దర్శకుడు మహి వీ రాఘవ్.
చాలా కాలంగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ అంటూ ఊరిస్తున్నారు టీమ్. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు మహి వీ రాఘవ్. ఒక్క ట్వీట్ ద్వారా వైఎస్ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. ఆ రోజు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు పరోక్షంగా వెల్లడించారు దర్శకుడు. జులై 8, 2023 అంటూ ట్వీట్ చేశాడు. దీంతో కావాల్సిన స్టఫ్ ఇచ్చేశాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా `యాత్ర2`కి సంబంధించిన అప్ డేట్ వస్తుందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు `యాత్ర 2`ని అధికారికంగా ఆ రోజు ప్రకటించనున్నారట. ఈ సందర్భంగా కేవలం ప్రకటనే కాదు, అంతకు మించిన సర్‌ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశారట మహి వీ రాఘవ్ టీమ్. అది ఆ రోజు అభిమానులకు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే సినిమాని ప్రారంభించి ఏపీ ఎన్నికలకు ముందే సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. రాబోయే ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ సినిమాని రిలీజ్ చేస్తే రాజకీయంగా ఇది ప్లస్ అవుతుందని భావిస్తున్నారట వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నాయకులు. ఓ రకంగా ఈ మూవీ వైఎస్‌ఆర్‌సీపీకి ప్రోగా ఉండబోతుందని సమాచారం. మరి మహి ఎలా తీస్తారనేది చూడాలి.
ఇక `యాత్ర2` మొత్తం వైఎస్ జగన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ప్రధానంగా, ఆయన సీఎం అయ్యేంత వరకు ఉంటుందని సమాచారం. ఇందులో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నట్టు టాక్. వీటిపై టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దర్శకుడు మహి వీ రాఘవ్.. ఇటీవల హాట్ టాపిక్‌గా మారుతున్నారు. `యాత్ర`, `ఆనందో బ్రహ్మ`, `సేవ్ ది టైగర్స్` లాంటి సినిమాలు చేసిన ఆయన ఇటీవల `సైతాన్` అంటూ ఓ బోల్డ్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ రూపొందించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ రిలీజ్ తర్వాత మంచి ఆదరణ పొందింది. దీన్ని ఆడియెన్స్ తెగ చూశారు. అంతేకాదు `సైతాన్ 2`ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు `యాత్ర2`ని తెరకెక్కించబోతున్నారనే వార్త మరింత ఆసక్తికరంగా, హాట్ టాపిక్ గా మారింది.
