‘పుష్ప2’ లో టాలీవుడ్ సీనియర్ హీరో? వైజాగ్ షెడ్యూల్ లో ఉన్నాడా!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’లో టాలీవుడ్ సీనియర్ హీరో నటించబోతున్నట్టు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ లోనూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరాయన అంటే.. 
 

Crazy update on Allu Arjuns Pushpa The Rule movie!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్ర షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా షెడ్యూల్ కోసం యూనిట్ మొత్తం వైజాగ్ కు తరలి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి ఫ్యాన్స్ అల్లు అర్జున్ కు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి, నగరంలో ర్యాలీ కూడా తీశారు. రేపటి నుంచి షూటింగ్ విశాఖపట్నంలో కొనసాగనుంది. ఈ  మేరకు నిన్న రాత్రే సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మందన్న చేరుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ షెడ్యూల్ లో పది రోజుల పాటు షూటింగ్ ఉంటుందని సమాచారం. వైజాగ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో కూడా ఈ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు (Jagapathi Babu) కూడా ‘పుష్ప2’లో కీలక పాత్రలో అలరించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ దర్శకత్వంలో జగపతి బాబు  ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. నాన్నకు ప్రేమతో.. రంగస్థలం చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోనూ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. జగపతి బాబుతో పాటు సీక్వెల్ లో మరిన్ని క్యారెక్టర్లు కనిపిస్తాయని టాక్ వినిపిస్తోంది.

లేటెస్ట్ షెడ్యూల్ లో జగపతి బాబు హాజరవుతున్నారని అంటున్నారు. ఆయన విషయంలో ‘పుష్ప : ది రూల్’లోనూ సుకుమార్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. కొన్నేండ్ల పాటు హీరోగా అలరించిన  జగపతి బాబు విలన్ గా టర్న్ తీసుకొని ప్రస్తుతం దుమ్ములేపుతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం ‘సలార్’(Salaar)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీలో ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో నటిస్తున్నారు. ఇక సీక్వెల్ ను రూ.350 కోట్లతో మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios