యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్న కథలతో  ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తను తాజాగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’. ఈ చిత్ర టీజర్ పై తాజాగా అప్డేట్ అందించారు మేకర్స్.  

షార్ట్ ఫిల్మ్ లతో తన కేరీర్ ను ప్రారంభించిన కిరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు యంగ్ హీరో కిరణ్ అబ్బరవం.. వచ్చిన ఆఫర్లను సరిగా వినియోగించుకుంటూ దూసుకెళ్తున్నాడు. తొలుత ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో లీడ్ రోల్ యాక్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ‘సెబాప్టియన్ పీసీ 524’ కూడా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. కానీ కొత్త రిస్క్ తో కూడుకున్న కథాంశాన్ని ఎంచుకోవడంతో రీచ్ తగ్గినా కిరణ్ యాక్టింగ్ కు అసలైన మార్కులు పడ్డాయి. 

మూడు చిత్రాలతో టాలీవుడ్ యంగ్ హీరోగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ పోతున్నాడు కిరణ్. ప్రస్తుతం ‘సమ్మతమే’ చిత్రంలో నటిస్తున్నాడు. హీరోయిన్ గా ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని (Chandini) నటిస్తోంది. వీరిద్దరూ క్రిష్ణ, సాన్వి అనే ప్రేమికుల పాత్రలో నటిస్తున్నారు. యూజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సమ్మతమే నుంచి క్రేజీ అప్డేట్ ను అందించారు. రేపు ఉదయం 11:11 గంటలకు ఎనర్జిటిక్ ట్రైలర్ రాబోతున్నట్టు అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో కిరణ్ అభిమానులు ఖుకషీ అవుతున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. 

కిరణ్ అబ్బవరం కేవలం మూడు చిత్రాలతో తన సత్తాచాటారు. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో వచ్చిన హిట్ ను క్యాచ్ చేసుకొని వరుసగా చిత్రాలను లైనప్ చేశారు. ఏకకాలంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడీ యంగ్ హీరో. సమ్మతమే చిత్రంతో పాటు.. నేను మీకు బాగా కావాల్సినవాడిని, వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాల్లో నటిస్తున్నారు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. జూన్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

Scroll to load tweet…