మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ (Ghani) మూవీ నుంచి క్రేజీ అప్డేట్ అందింది. ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ సమయంలో మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేసే పనిలో ఉన్నారు.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరో.. హీరోయిన్ గా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాకు మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మూడు నెలల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. రీసెంట్ గా ఫిబ్రవరి 25న రిలీజ్ పక్కా అంటూ అనౌన్స్ చేశారు టీమ్. అంతే కాదు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కాని అదేరోజు పవర్ స్టార్ భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో గనీ మరో డేట్ వెతుక్కోక తప్పలేదు. దీంతో మార్చి 4న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ డ్రాప్ అయ్యి చివరికి సినిమాను ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
తాజాగా మేకర్స్ మరో అప్డేట్ అందించారు. ఈ మేరకు 12 సెకండ్ల ఓ వీడియో క్లిప్ ను విడుదల చేశారు. మార్చి 17న గని మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. శుక్రవారం ఉదయం 10 : 30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియోను వరుణ్ తేజ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ‘గ్లౌస్ ఆన్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే అప్పటి వరకు ఇంకా 20 రోజులకు పైనే సమయం ఉంది. దీంతో తమ సినిమా ప్రమోషన్స్ ను కూడా షూరు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 17న థియేట్రకల్ రిలీజ్ చేయనున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్స్ తో ఆడియెన్స్ ను తమవైపు తిప్పుకునేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
